Begin typing your search above and press return to search.

వర్మగా కేసీఆర్..కే.విశ్వనాథ్ లా కాంగ్రెస్: రేవంత్

By:  Tupaki Desk   |   21 Oct 2018 10:06 AM GMT
వర్మగా కేసీఆర్..కే.విశ్వనాథ్ లా కాంగ్రెస్: రేవంత్
X
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓ ప్రముఖ మీడియా అధినేతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రకటించిన 2014 మేనిఫెస్టో శివ సినిమాలా ఉందని.. కేసీఆర్ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను తలపించాడని.. కానీ అదే టైంలో రిలీజ్ అయిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను డైరెక్టర్ కే. విశ్వనాథ్ తో పోల్చారు.

రాంగోపాల్ వర్మ శివ చిత్రంతో ఓ కొత్త ప్రయోగం చేశాడని.. అలాంటి ప్రయోగమే కేసీఆర్ 2014లో చేస్తే ఆ ప్రయోగాన్ని ప్రజలు ఇష్టపడి గెలిపించారని రేవంత్ రెడ్డి తెలిపారు.శివ తర్వాత రాంగోపాల్ వర్మ తన విజయయాత్రను కొనసాగించడంలో విఫలమయ్యాడని.. అలానే కేసీఆర్ కూడా ప్రజల్లో ఫెయిల్ అయ్యాడని రేవంత్ విమర్శించారు. ‘రాత్రి’ సినిమా నుంచి వర్మ అపజయాలు కొనసాగాయని.. కేసీఆర్ ది కూడా అంతేనని వెల్లడించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కే. విశ్వనాథ్ లా ఫ్యామిలీ సినిమాలా నడుచుకొని చేతులు కాల్చుకుందని కాంగ్రెస్ ను పోలుస్తూ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.

కానీ ఇక్కడే రేవంత్ తోపాటు మీడియా అధినేత లాజిక్ ను మరిచారు. కే. విశ్వనాథ్ మూవీలు మాస్ ను మెప్పించలేకపోయినా క్లాస్ ఆర్టిస్టులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ అవి చరిత్రలో కలకాలం నిలిచిపోయిన చిత్రాలుగా ఉన్నాయి. వర్మను - విశ్వనాథ్ ను పార్టీలతో పోల్చడమే తప్పు. వీరిని పార్టీలకు పోల్చి అవమానించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.