Begin typing your search above and press return to search.

బాబు-రేవంత్‌ ది..ధుర్యోధ‌నుడు-క‌ర్ణుడి స్నేహమ‌ట‌

By:  Tupaki Desk   |   5 Oct 2015 7:51 AM GMT
బాబు-రేవంత్‌ ది..ధుర్యోధ‌నుడు-క‌ర్ణుడి స్నేహమ‌ట‌
X
టీ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్‌ రెడ్డి - టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడిపై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ఇద్ద‌రి స్నేహాన్ని మ‌హాభార‌తంలో ధుర్యోధ‌నుడు-క‌ర్ణుడి స్నేహంతో పోల్చారు. రేవంత్ ఓ టీవీ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో మాట్లాడుతూ "నాకు మహాభారతంలో దుర్యోధనుడు - కర్ణుడి స్నేహం అంటే చాలా ఇష్టం. నేను కూడా చంద్రబాబు కోసం కర్ణుడిలా పనిచేయాలనుకుంటాను" అని వ్యాఖ్యానించారు.

తాజాగా టీడీపీ క‌మిటీల ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో చంద్ర‌బాబు తెలంగాణ పార్టీ ప‌గ్గాల‌ను రేవంత్‌ కు అప్ప‌గిస్తార‌ని వార్త‌లు వ‌చ్చినా ఆయ‌న ప్ర‌స్తుతం పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న ఎల్‌.ర‌మ‌ణ‌నే కొన‌సాగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. రేవంత్‌ కు టీ టీడీపీ వ‌ర్కింగ్ క‌మిటీ ప్రెసిడెంట్ బాధ్య‌త‌ల‌తో స‌రిపెట్టారు. చంద్ర‌బాబు లెక్క‌లు ఎలా ఉన్నా...బ‌య‌ట మాత్రం రేవంత్ ఈ విష‌యంలో అసంతృప్తిగా ఉన్నారంటూ ప్ర‌చారం ఊపందుకుంది. ఈ వార్త‌ల‌పై స్పందించిన రేవంత్ పై విధంగా స‌మాధానం ఇచ్చారు.

అయితే అంత‌ర్గ‌తంగా విన‌ప‌డుతున్న మ‌రో స‌మాచారం ప్ర‌కారం రేవంత్‌ ను చంద్ర‌బాబు స‌రైన టైంలో స‌రైన విధంగా వాడ‌తార‌ని...ప్ర‌స్తుతం ఓటుకు నోటు కేసు నేప‌థ్యంలో రేవంత్‌ కు వెంట‌నే ప‌గ్గాలు అప్ప‌గించ‌డం క‌న్నా కొద్ది రోజులు ఆగాకే బాధ్య‌త‌లు ఇస్తే బాగుంటుంద‌ని బాబు డిసైడైన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెపుతున్నాయి. టీఆర్ ఎస్‌ కు సరైన మొగుడు రేవంత్ రెడ్డే అని చంద్ర‌బాబు చాలా సార్లు టీడీపీ కీల‌క నాయ‌కుల వ‌ద్ద అన్నార‌ని కూడా వారు చెపుతున్నారు.

టీ టీడీపీ ప‌గ్గాల కోసం చంద్ర‌బాబు కార్య‌క‌ర్త‌ల ద్వారా సేక‌రించిన ఐవీఆర్ ఎస్ ప‌ద్ధ‌తిలో కూడా రేవంత్‌ కే ఎక్కువ ఓట్లు వ‌చ్చినట్టు వార్త‌లు వెలువ‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా త‌న‌కు అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చినా...ఇవ్వ‌క‌పోయినా బాబుతో త‌న స్నేహ‌బంధం స్ర్టాంగ్ అని రేవంత్ మ‌రోసారి స్ప‌ష్టంగా త‌న అభిప్రాయం చెప్పారు.