కేసీఆర్ పై రేవంత్ పంచులు.. మామూలుగా లేవు..

Wed Nov 07 2018 16:54:05 GMT+0530 (IST)

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో విమర్శలు చేస్తూ నవ్వులు పూయించారు. కేసీఆర్ అంటే.. కల్వకుంట్లలోని క.. చంద్రశేఖర్ లోని చ రావు లోని రా తీసుకుంటే కచరా అవుతుందని.. ఇది వాళ్ల బతుకులని తేల్చి పారేశారు.డబుల్ బెడ్ రూం ఇళ్లు దళితులకు మూడు ఎకరాల భూమి ఇంటికో ఉద్యోగం ఫీజు రాయితీ నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రి మండలానికి 30 పడకల ఆస్పత్రి జిల్లాకో మెడికల్ కాలేజీ గిరిజనులు మైనార్టీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్ రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చావా అంటూ కేసీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు.  వీటిలో ఏ ఒక్కటి చేయలేదు కనుకే.. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ శ్రేణులపై తిరగబడుతున్నారని అన్నారు. యువకులు మహిళలు ఓట్ల అడగడానికి కారు పార్టీ వాళ్లు వస్తే వాతలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ఇక కేసీఆర్ మూడో కన్ను తెరుస్తానని అనడంపైనా రేవంత్ కౌంటర్ ఇచ్చారు. అర్థరాత్రి 12 గంటలకు రెండేసి కేసీఆర్ పడుకుంటే.. మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది లెగవడానికి.. ఇదే మూడోకన్ను ఏమో అని సెటైర్ వేశారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తావని ఎమ్మెల్యే చేస్తే నాలుగు పెగ్గులు వేసి పడుకొని బజార్లోకి రాకుండా ఫాం హౌస్ లో పడుకుండిపోవడం ఏమిటని రుసరుసలాడారు.

ఈ నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల లెక్క ఏంటో తేల్చాలని సవాల్ విసిరారు. కారు పార్టీ వాళ్లు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని అన్నారు. ప్రజలు తిరగబడుతున్నారని చేతి పిర్రెల మీద వాతలు వేసి తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని  అన్నారు. ఎన్నికల ప్రచారంలో మాటకు మాట కౌంటర్ ఇస్తున్న రేవంత్.. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు చేస్తున్న కృషి ఎంతవరకు ప్రతిఫలం ఇస్తుందో వేచి చూడాల్సిందే.