Begin typing your search above and press return to search.

షుగ‌ర్ పెంచ‌ని బియ్యం వ‌చ్చేస్తున్నాయ్

By:  Tupaki Desk   |   21 Nov 2017 5:30 PM GMT
షుగ‌ర్ పెంచ‌ని బియ్యం వ‌చ్చేస్తున్నాయ్
X
షుగ‌ర్ తో బాధప‌డే వారికి స్వీట్ న్యూస్‌. ఎంత ఇష్టం ఉన్నా క‌డుపు నిండా అన్నం తినే అవ‌కాశం లేని రోజులు రానున్న రోజుల్లో పోనున్నాయ్‌. ఎందుకంటే.. షుగ‌ర్ లెవెల్స్ పెంచే బియ్యం స్థానంలో షుగ‌ర్ లెవెల్స్ ను పెంచ‌ని స‌రికొత్త బియ్యాన్ని త‌యారు చేశారు శాస్త్ర‌వేత్త‌లు. షుగ‌ర్ తో ఇబ్బంది ప‌డే వారు త‌మ షుగ‌ర్ లెవల్ కంట్రోల్ చేసుకోవ‌టానికి వ‌రి అన్నాన్ని వ‌దిలేసి.. జొన్న రొట్టెల‌తోనో.. ఇత‌ర చిరుధాన్యాల‌తో తినే ఇబ్బందిని అధిగ‌మించే అవ‌కాశం వ‌చ్చేసింది.

షుగ‌ర్ పేషెంట్లు సైతం నిర‌భ్యంత‌రంగా అన్నాన్ని తినేందుకు వీలైన స‌రికొత్త వ‌రి వంగ‌డాన్ని శాస్త్ర‌వేత్త‌లు సృష్టించారు. సెంట‌ర్ ఫ‌ర్ సెల్యుల‌ర్ మాలిక్యూర్ బ‌యాల‌జీ.. ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ స‌రికొత్త వ‌రి వంగ‌డాన్ని అభివృద్ధి చేశారు. సాధార‌ణ సాంబ మ‌సూరి ర‌కంలో గ్లైసీమిక్ ఇండెక్స్ 52.9 నుంచి 69 శాతం వ‌ర‌కు ఉంటుంది. కానీ.. ఐఎస్ ఎంలో అది కేవ‌లం 50.99 శాతం మాత్ర‌మే ఉండ‌నుంది.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు త‌మిళ‌నాడు.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. బిహార్ ల‌లో 1.30 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో సాగు చేయ‌గా.. ఎక‌రాకు 35 నుంచి 37 బ‌స్తాల దిగుబ‌డి వ‌చ్చిన‌ట్లుగా వెల్ల‌డించారు. ఈ వ‌రి వంగ‌డం రైతుల‌కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుంద‌ని వెల్ల‌డించారు.

కొత్త ర‌కం వ‌రిలో త‌క్కువ‌గా ఉంటుంద‌ని చెబుతున్న గ్లైసీమిక్ ఇండెక్స్ ఏమిట‌న్న‌ది చూస్తే.. ఆహారం తిన్న‌త‌ర్వాత అది ఎంత సేప‌టికి ర‌క్తంలో చ‌క్కెర‌గా మారుతుందో తెలిపే ప్ర‌క్రియ‌. కొన్ని ఆహార ప‌దార్థాలు తిన్న‌ప్పుడు వేగంగా చ‌క్కెర‌గా మార‌తాయి. మ‌రికొన్నింటిలో నెమ్మ‌దిగా మార‌తాయి. వ‌రి అన్నం వేగంగా చ‌క్కెర‌గా మారే గుణం ఉంటుంది. అందుకే షుగ‌ర్ ఉన్న వారు వ‌రి అన్నాన్ని తిన‌కూడ‌ద‌ని చెబుతుంటారు. తాజాగా త‌యారు చేసిన వ‌రివంగంతో అలాంటి ఇబ్బంది ఉండ‌దు.

సాధార‌ణ వ‌రితో పోలిస్తే.. ఈ స‌రికొత్త వ‌రి వంగ‌డంలో ఉన్న ప్ర‌త్యేక‌త‌ల్ని చూస్తే.. సాధార‌ణ వ‌రి వంగ‌డంలో ఎండాకు తెగులు రైతులు ఇబ్బంది పెడుతుంది. దీంతో రైతులు పెద్ద ఎత్తున న‌ష్ట‌పోతుంటారు. కొత్త ర‌కంలో ఈ ఎండాకు తెగులును త‌ట్టుకునే జ‌న్యువులు ఉన్నాయి. ఈ కార‌ణంతో ఎండాకు తెగులు ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లోనూ ఈ వ‌రి వంగ‌డాన్ని ధైర్యం వేసుకోచ్చు.. సాధార‌ణ వ‌రి ర‌కానికి వ‌రి కాండం స‌న్న‌గా ఉంటుంది. దీంతో బ‌ల‌మైన గాలులు వీచిన‌ప్పుడు కాండం విరిగిపోయే ప్ర‌మాదం ఉంది. కానీ ఐఎస్ఎం ర‌కం వ‌రి కాండం మందంగాఉంటుంది. దీంతో.. గాలుల‌కు సైతం త‌ట్టుకోగ‌ల‌దు. సాంబ మ‌సైరితో పోలిస్తే కొత్త ర‌కం 7 నుంచి 10 రోజులు త‌క్కువ‌గా కోత‌కు వ‌స్తుంది. విత్త‌నాలు నేరుగా చ‌ల్ల‌టం ద్వారా మ‌రో వారం త‌క్కువ స‌మ‌యంలోనే దిగుబ‌డి వ‌స్తుంది.