Begin typing your search above and press return to search.

ఇప్పుడేం చేస్తారు అమెరికన్స్!!

By:  Tupaki Desk   |   25 March 2017 10:20 AM GMT
ఇప్పుడేం చేస్తారు అమెరికన్స్!!
X
అమెరికాలో ఉంటున్న.. ఏటా అమెరికాకు వస్తున్న విదేశీయుల వల్ల నేటివ్ అమెరికన్లకు ఉద్యోగాలు దొరకడం లేదన్నది వారి ఆరోపణ. ట్రంప్ రెచ్చగొడుతున్న ఈ భావజాలం ఇప్పుడు అమెరికన్ల నరనరాల్లోకి పాకేసింది. దీంతో విద్వేషం వెర్రితలలు వేసి భారతీయులు సహా శ్వేతజాతేతరులపై దాడులు - దూషణలు - హత్యలు పెరిగిపోతున్నాయి. అయితే... ఆటోమేషన్ - రోబోట్ల కారణంగా అమెరికాలో లక్షలాది ఉద్యోగాలు పోనున్నాయి. మరి.. ఈ విషయంలో అమెరికన్లు ఏం చేస్తారు? రోబోట్లనూ చంపేస్తారా?

ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ వర్కర్లు తమ ఉద్యోగాలను రోబోట్లకు వదులుకోవాల్సి వస్తుందని.. దానిలో ముఖ్యంగా అమెరికా ఎక్కువగా ప్రభావితం కానుందని తాజా రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. రోబోట్స్ - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే పదిహేనేళ్లలో దాదాపు 38 శాతం అమెరికన్ ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ నివేదికలో వెల్లడైంది.

అమెరికా, యూకే లేబర్ మార్కెట్లో సర్వీసు ఉద్యోగాలు ఎక్కువగా ఆధిపత్యం కొనసాగిస్తుంటాయని, అదే స్థాయిలో కీలకరంగాలైన ఫైనాన్స్ - ట్రాన్స్ పోర్టేషన్ - ఎడ్యుకేషన్ - మానుఫ్రాక్ట్ర్చరింగ్ - ఫుడ్ సర్వీసులల్లో ఉద్యోగులు ఎక్కువగా పనిచేస్తుంటారని రిపోర్టు తెలిపింది. ఫైనాన్సియల్ సర్వీసెస్ ఉద్యోగాలు తీసుకుంటే, రోబోట్స్ తో రీప్లేస్ అయి, 61 శాతం ఉద్యోగాలు హరించుకుపోతాయని రిపోర్టు వెల్లడించింది. అలాంటప్పుడు శ్వేతజాతేతరులను వెల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు రోబోట్లనూ తరిమేయగలుగుతారా.. వాటినేం చేస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/