Begin typing your search above and press return to search.

రేణుక చేతిలో టీఆర్ ఎస్ ఓడిపోయిందే!

By:  Tupaki Desk   |   22 April 2019 1:41 PM GMT
రేణుక చేతిలో టీఆర్ ఎస్ ఓడిపోయిందే!
X
అదేంటీ... పోలింగ్ మాత్ర‌మే ముగిసింది క‌దా. ఇంకా కౌంటింగే మొద‌లు కాలేదు. అప్పుడే టీఆర్ ఎస్ అభ్య‌ర్థిపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ రేణుకా చౌద‌రి ఎలా నెగ్గార‌బ్బా అనుకుంటున్నారా? గెలుపు అంటే... ఒక్క సార్వ‌త్రిక ఎన్నిక‌లేనా? ఇంకే ఎన్నిక‌ల్లో గెలిచినా గెలుపు కాదా? స‌రేలే... అస‌లు విష‌యంలోకి వ‌స్తే... ముందుగా చెప్పుకున్న‌ట్లు టీఆర్ ఎస్ ను రేణుకా చౌద‌రి ఓడించారు. అయితే ఈ ఎన్నిక‌ల సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించిన గెలుపు కాదు. హెచ్ ఎంటీ కార్మిక సంఘానికి జ‌రిగిన ఎన్నిక‌.

హైద‌రాబాదు శివారు కుత్బుల్లాపూర్ ప‌రిధిలో హెచ్ ఎంటీ యూనిట్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ కంపెనీ కార్మిక సంఘం ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ త‌ర‌ఫున స్థానిక టీఆర్ ఎస్ ఎమ్మెల్యే వివేకానంద నిల‌బ‌డ‌గా - ఆయ‌న‌కు పోటీగా రేణుకా చౌద‌రి బ‌రిలోకి దిగారు. ఇక్కడ మొత్తం 151 ఓట్లు ఉండ‌గా... 141 పోల‌య్యాయి. శ‌నివారం ముగిసిన కౌంటింగ్ లో రేణుక‌కు 79 ఓట్లు రాగా - వివేక్ కు 65 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. దీంతో 14 ఓట్ల తేడాతో రేణుకా చౌద‌రి విజ‌యం సాధించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా కొన‌సాగిన రేణుక‌... ఈ ద‌ఫా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం ఎంపీ సీటుకు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసిందే. వెర‌సి అక్క‌డ టీఆర్ ఎస్ కు గ‌ట్టి పోటీ ఇస్తున్న రేణుక ఏకంగా గెలిచేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇలాంటి త‌రుణంలో హెచ్ ఎంటీ కార్మిక సంఘం ఎన్నిక‌ల్లో ఆమె టీఆర్ ఎస్ ను చిత్తు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే... ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ బంప‌ర్ మెజారిటీతో విక్ట‌రీ సాధించినా... ఆ త‌ర్వాత జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మాత్రం ఆ పార్టీకి షాక్ త‌గిలింది. తాజాగా హెచ్ ఎంటీ కార్మిక సంఘం ఎన్నిక‌ల్లోనూ రేణుక చేతిలో టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా ఓట‌మి పాల‌వ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. మొత్తంగా అసెంబ్లీలో ల‌భించిన గెలుపు సంబ‌రాలు టీఆర్ఎస్ కు ఎక్కువ కాలం నిలిచేలా లేవ‌న్న వాద‌న వినిపిస్తోంది.