Begin typing your search above and press return to search.

బాయ్ ఫ్రెండ్ కోసమో.. యాప్!!

By:  Tupaki Desk   |   19 Oct 2018 9:45 AM GMT
బాయ్ ఫ్రెండ్ కోసమో.. యాప్!!
X
జమానా మారుతుంది బాస్. ట్రెండ్ ఫాలో అవడం కాదు కొత్త ట్రెండ్ ను ఇండియాలోనూ పరిచేయం చేశాడో యువకుడు. అదే బాయ్ ఫ్రెండ్ యాప్. కొత్త ఫ్రెండ్ కోసం వెతుక్కునే పని లేకుండా - ప్రస్తుత కాలానికి అనుగుణంగా తయారు చేసిన ఈ యాప్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇండియాకు తొలిసారిగా పరిచయమైన ‘రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్’ యాప్ ను ముంబైకి చెందిన కౌశిక్ ప్రకాశ్(29) అనే యువకుడు రూపొందించాడు. వినడానికి కాస్తా కొత్తగా ఉన్నా, మంచి సేవలనే అందజేస్తామని అంటున్నాడు కౌశిక్. ప్రస్తుతం డేటింగ్ ల కాలం నడుస్తుంది. డేటింగ్ పేరుతో చాలా యాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే, అవన్నీ చాలా వరకు జనాల ఆదరణ పొందలేకపోయాయని, ‘రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్’ కు సక్సెస్ అవడం ఖాయమని అంటున్నాడు కౌశిక్.

ఇందులో ఎవరైన ప్రవేశించడానికి చాలా అప్షన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలో కూడా ఎంచుకోవచ్చు. సెలబ్రిటీ - మోడల్ - నార్మల్ బాయ్ ఫ్రెండ్ అనే ఆప్షన్లు కల్పించారు. గంట - రెండు గంటలు - రోజు లెక్కన బుక్ చేసుకోవచ్చు. కేవలం వీరు అమ్మాయిలతో సరదాగా గడపడం - కబుర్లు చెప్పడం వరకే పరిమితి ఉంటుంది. అంతకు మించి ఎవరూ ప్రవర్తించరాదనే కండీషన్ ఉంటుంది.

బాయ్ ఫ్రెండ్ తో వీడిపోయినా - పార్టీలకు వెళ్లేందుకు ఎవరూ తోడు లేరనే దిగులు - ఏకాంతం వల్ల వచ్చే డిప్రెషన్ పోగొట్టుకోవడానికి ‘రెంట్ ఫర్ ఏ బాయ్ ఫ్రెండ్’ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ ఆలోచన కొంత బాగానే ఉందని అనుకున్నా, తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉండబోతాయో అన్న సందేహం రాక మానదు.