Begin typing your search above and press return to search.

న‌వరాత్రుల వేళ‌.. తెలుసుకోవాల్సిన గుడి!

By:  Tupaki Desk   |   13 Oct 2015 2:31 PM GMT
న‌వరాత్రుల వేళ‌.. తెలుసుకోవాల్సిన గుడి!
X
దేశ‌వ్యాప్తంగా న‌వ‌రాత్రులు మొద‌ల‌య్యాయి. విజ‌య‌ద‌శ‌మి ముందు నిర్వ‌హించే ఈ న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా.. దేశంలోని విల‌క్ష‌ణ‌త‌ను.. మ‌త సామ‌ర‌స్యం గురించి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇవాళ‌.. రేప‌టి రోజున‌ ప‌ర‌మ‌త స‌హ‌నం అన్న‌ది లేద‌న్న విమ‌ర్శలు స‌ర్వ‌త్రా వినిపిస్తున్న‌వేళ‌.. అలాంటివెన్నో మ‌న చుట్టూ ఉన్న సమాజం లో ఉన్నాయ‌ని.. దుర‌దృష్ట‌వ‌శాత్తు మంచి కంటే చెడు ఎక్కువ ప్ర‌చారం అవుతున్న ప‌రిస్థితి. ఎక్క‌డో ఒక‌చోట జ‌రిగిన త‌ప్పును దేశం మొత్తానికి ఆపాదిస్తున్న వేళ‌.. మంచి విష‌యాల్ని కూడా అదే రీతిలో ప్ర‌చారం చేయాల్సి ఉంది. కానీ.. అలాంటివేమీ క‌నిపించ‌ని ప‌రిస్థితి.

మ‌సీదుల్ని.. చ‌ర్చిల్ని క‌ట్టించిన హిందువులెంద‌రోక‌నిపిస్తే.. ఒక ముస్లిం మ‌హిళ దుర్గామాత ఆల‌యాన్ని బాగు చేయ‌ట‌మే కాదు.. ప్ర‌పంచానికే దుర్గామాత అమ్మ అంటూ కీర్తిస్తూ పూజ‌లు చేస్తుంది. ఆమె బాగు చేయించిన గుడిలో స‌భ్యులుగా హిందూ.. ముస్లింలు ఉంటూ భిన్న‌త్వంలో ఏక‌త్వం అన్న మాట‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో రోజుకూలీ చేసుకునే కార్మికురాలు సుషుబ్రీ. 45 ఏళ్ల వ‌య‌సున్న ఆమెలో మ‌రో ప్ర‌త్యేక‌త ఉంది. తాను ఉండే మంద్ సౌర్ జిల్లాలోని ఇంద్ర కాల‌నీలో నివాసం ఉంటుంది. ఆమె ఉంటున్న ఇంటి ప‌క్క‌న దుర్గామాత దేవాల‌యం ఉంది. కానీ.. అది శిధిలావ‌స్థ‌కు చేరుకుంది. దీంతో.. ఆమె క‌లుగ‌జేసుకొని గ్రామంలోని ప్ర‌తి ఇంటి నుంచి రెండు రూపాయిల చొప్పున సేక‌రించింది.

దాని పున‌రుద్ధ‌ర‌ణ కోసం కృషి చేసిన ఆమె..ఆల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హిస్తుంటారు. మ‌తంతో త‌న‌కు ప‌ని లేద‌ని.. ఆ మాట‌కు వ‌స్తే.. దుర్గామాత లోకానికే అమ్మ‌గా ఆమె కీర్తిస్తారు. ఈ ఆల‌య క‌మిటీలో ముస్లింలు.. హిందువులు స‌భ్యులుగా ఉంటారు. ‌‌మ‌త సామ‌ర‌స్యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా ఉండే ఈ ఆల‌యంలో రోజూ రెండుసార్లు నిర్వ‌హించే హార‌తికి అంద‌రూ హాజ‌ర‌వుతుంటారు. ఇలాంటివి మ‌న దేశంలోనే సాధ్య‌మ‌వుతాయేమో.