Begin typing your search above and press return to search.

రిలయన్స్ పియో కూడా కావాలంట!

By:  Tupaki Desk   |   24 Oct 2016 10:30 PM GMT
రిలయన్స్ పియో కూడా కావాలంట!
X
టెలీకాం రంగంలో తాజాగా రిలయన్స్ జియో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. మూడు నెలలు ఉచితం అనే మాటతో ఈ జియో ని తీసుకోవడానికి జనాలు స్టోర్స్ ముందు క్యూ కట్టారు. దీంతో రిలయన్స్ జియో లాగానే ముఖేష్ అంబానీ మద్యం వ్యాపారంలోకి కూడా రావాలని మందుబాబులు కోరుతున్నట్లు గా సోషల్ మీడియా యూజర్లు సరదాగా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్‌ లో హల్‌ చల్ చేస్తోంది.

ముఖేష్ అంబానీని మద్యం వ్యాపారంలోకి రావాల్సిందిగా మందుబాబులు కోరుతున్నట్లుగా పోస్ట్ పెట్టి - దానికి "రిలయన్స్ పియో" అని పేరు పెట్టాలని సూచించారు. దీనివెనక ఉన్న లాజిక్ ఏమిటో ఇప్పటికే అందరికీ అర్ధం అయ్యి ఉంటుంది. ఈ రిలయన్స్ పియో ద్వారా మద్యం ఫ్రీగా ఇవ్వాలని - స్నాక్స్‌ కు మాత్రమే ఛార్జ్ చేయాలని సూచన. అతి తక్కువ ధరకే డేటా ఇస్తామంటూ ప్రకటించిన ముఖేష్ అంబానీ - వాయిస్ కాల్స్ పూర్తిగా ఫ్రీ అంటూ ఇతర కంపెనీలకు ఊహించని షాకిచ్చిన "జియో" దీనికి ఆదర్శం అంట. దీంతో ఈ సరదా పోస్ట్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది!

కాగా, ముఖేష్ అంబానీ నాటి కొద్ది నిమిషాల ప్రసంగం అప్పటివరకూ దిగ్గజాలుగా పేర్కొంటున్న కంపెనీలకు కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. ఈ షాక్ నుంచి తేరుకున్న మిగిలిన టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో ప్రకటనతో తమ వినియోగదారులు ఎక్కడ చేజారిపోతారోనని ఆత్మరక్షణలో పడ్డాయి. మరో విషయం ఏంఇటంటే... అప్పటివరకూ వందలు - వేలలో వసూలు చేసిన డేటా ఛార్జీలను మిగిలిన టెలికాం కంపెనీలన్నీ చాలావరకూ తగ్గించాయి. దీంతో వినియోగదారులు పండగ చేసుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/