Begin typing your search above and press return to search.

మోడీ గొప్పా..? ముకేశ్ గొప్పా?

By:  Tupaki Desk   |   24 July 2017 2:00 PM GMT
మోడీ గొప్పా..? ముకేశ్ గొప్పా?
X
డిజిటల్ ఇండియా అంటూ ఎన్నెన్నో చెప్తున్న మోడీ ప్రభుత్వం విద్యార్థులను పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ కు చేరువ చేయలేకపోయింది. అయితే... మోడీ చేయలేని పనిని ముకేశ్ అంబానీ చేస్తున్నారు. గత ఏడాది జియో ఫ్రీ డాటాతో చాలావరకు యూత్ కి ప్రపంచాన్ని చూపించిన ఆయన ఇప్పుడు కాలేజి విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. దేశంలోని 3 కోట్ల మంది విద్యార్థులకు లబ్ది కలిగేలా వేలాది కాలేజీల్లో జియో ఫ్రీ వైఫై సేవలు ఆరంభించబోతున్నట్లు సమాచారం.

దీనిపై ఇప్పటికే రిలయన్స్ జియో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డీ)కి ఓ ప్రపోజల్‌ను పంపినట్టు తెలిసింది. ఇది ఓకే అయితే మొదటి దశలో దేశంలో ఉన్న 38వేల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. తరువాత మిగిలిన కళాశాలల్లోనూ ఇలాంటి సేవలు అందించనున్నాట్లు తెలుస్తోంది.

అయితే.. ఉచిత వైఫైని జియో అందించాలని రిలయన్స్ అనుకున్నా కూడా అది ఏకపక్షంగా సాధ్యం కాదని.. నేరుగా ఆ కంపెనీకే ప్రాజెక్టు ఇవ్వడం కుదరదని, ఈ విషయంలో టెండర్లను ఆహ్వానిస్తామని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. అయితే ఉచితంగా వైఫై సేవలను అందించడానికి జియో ముందుకొస్తుండడంతో ఆ కంపెనీకే టెండరు దక్కడం ఖాయం.