Begin typing your search above and press return to search.

జియో కొత్త పోస్ట్‌ పెయిడ్ ప్లాన్లు ఇవే..!

By:  Tupaki Desk   |   25 April 2017 12:28 PM GMT
జియో కొత్త పోస్ట్‌ పెయిడ్ ప్లాన్లు ఇవే..!
X
మొబైల్ ఫ‌క్ష‌న్ వినియోగ‌దారుల‌ను ఆక‌ర్ష‌ణ‌ల వ‌ల‌లో వేసేందుకు రిల‌య‌న్స్ జియో మ‌రో ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ధన్ ధనా ధన్ ఆఫర్‌ను ప్రకటించి కొద్ది రోజులు కూడా కాలేదు. ఇంతలోపే తన యూజర్లకు గాను పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. మొత్తం 3 ప్లాన్లను జియో యూజర్లకు ఆఫర్ చేస్తోంది. ఇవన్నీ కేవలం జియో ప్రైమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్న వారు మాత్రమే ఈ ప్లాన్లను పొందేందుకు వీలు ఉంటుంది.

రూ.309 ప్లాన్ - అన్‌ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్‌ ఎంఎస్‌ లు, 90 జీబీ డేటా, రోజుకు 1 జీబీ డేటా లిమిట్, 3 నెలల వాలిడిటీ, ఆ తరువాత నెలవారీగా ప్లాన్ ఉంటుంది, 30 జీబీ డేటా వస్తుంది, రోజుకు 1 జీబీ డేటా లిమిట్ ఉంటుంది, అప్పుడు కూడా ఉచిత వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

రూ.509 ప్లాన్ - అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ - ఎస్‌ ఎంఎస్‌ లు, 180 జీబీ డేటా, రోజుకు 2 జీబీ డేటా లిమిట్, 3 నెలల వాలిడిటీ, ఆ తరువాత నెలవారీగా ప్లాన్ ఉంటుంది, 60 జీబీ డేటా వస్తుంది, రోజుకు 2 జీబీ డేటా లిమిట్ ఉంటుంది, ఉచిత వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు కంటిన్యూ అవుతాయి.

రూ.999 ప్లాన్ - అన్‌ లిమిటెడ్ వాయిస్ కాల్స్ - ఎస్‌ ఎంఎస్‌ లు - 180 జీబీ డేటా - రోజు వారీ డేటా లిమిట్ లేదు, ఎంతైనా వాడుకోవచ్చు, 3 నెలల వాలిడిటీ, ఆ తరువాత నెలవారీగా ప్లాన్ ఉంటుంది, 60 జీబీ డేటా వస్తుంది, అప్పుడు కూడా రోజు వారీ డేటా లిమిట్ ఏమీ ఉండదు, ఉచిత వాయిస్ కాల్స్, ఎస్‌ ఎంఎస్‌ లు కంటిన్యూ అవుతాయి.

ఇక జియో సవరించిన ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ ప్లాన్లు ప్రైమ్ - నాన్ ప్రైమ్ యూజర్లు ఇద్దరికీ అందుబాటులో ఉన్నాయి. పోస్ట్‌ పెయిడ్‌ లా ఇందులో నిబంధన ఏమీ లేదు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లు అన్నింటిలోనూ ఉచితంగా వాయిస్ కాల్స్, ఎస్‌ ఎంఎస్‌ లు వస్తున్నాయి కనుక వాటి వివరాలను ఇవ్వడం లేదు. కేవలం డేటా, వాలిడిటీ వివరాలను ఇవ్వడం జరుగుతోంది.

రూ.19 ప్లాన్ - 200 ఎంబీ డేటా (నాన్ ప్రైమ్‌ కు 100 ఎంబీ), 1 రోజు వాలిడిటీ

రూ.49 ప్లాన్ - 600 ఎంబీ డేటా (నాన్ ప్రైమ్‌ కు 300 ఎంబీ), 3 రోజుల వాలిడిటీ

రూ.96 ప్లాన్ (మొదటి రీచార్జ్‌ కు) - 7 జీబీ డేటా (నాన్ ప్రైమ్‌కు 600 ఎంబీ), రోజుకు 1 జీబీ లిమిట్, 7 రోజుల వాలిడిటీ

రూ.149 ప్లాన్ - 2 జీబీ డేటా (నాన్ ప్రైమ్‌ కు 1 జీబీ డేటా), రోజు వారీ లిమిట్ లేదు, 28 రోజుల వాలిడిటీ

రూ.309 ప్లాన్ - 84 జీబీ డేటా (నాన్ ప్రైమ్‌ కు 28 జీబీ), రోజుకు 1 జీబీ డేటా లిమిట్, 84 రోజుల వాలిడిటీ (నాన్ ప్రైమ్‌కు 28 రోజుల వాలిడిటీ)

రూ.509 ప్లాన్ - 168 జీబీ డేటా (నాన్ ప్రైమ్‌ కు 56 జీబీ), రోజుకు 2 జీబీ డేటా లిమిట్, 84 రోజుల వాలిడిటీ (నాన్ ప్రైమ్‌కు 28 రోజుల వాలిడిటీ)

రూ.999 ప్లాన్ - 120 జీబీ డేటా (నాన్‌ప్రైమ్‌ కు 60 జీబీ), రోజూ ఎలాంటి డేటా లిమిట్ లేదు, 120 రోజుల వాలిడిటీ (నాన్ ప్రైమ్‌కు 60 రోజుల వాలిడిటీ)

రూ.1999 ప్లాన్ - 185 జీబీ డేటా (నాన్ ప్రైమ్‌ కు 125 జీబీ), రోజూ ఎలాంటి డేటా లిమిట్ లేదు, 150 రోజుల వాలిడిటీ (నాన్ ప్రైమ్‌కు 90 రోజుల వాలిడిటీ)

రూ.4999 ప్లాన్ - 410 జీబీ డేటా (నాన్ ప్రైమ్‌ కు 350 జీబీ), రోజూ ఎలాంటి డేటా లిమిట్ లేదు, 240 రోజుల వాలిడిటీ (నాన్ ప్రైమ్‌కు 180 రోజుల వాలిడిటీ)

రూ.9999 ప్లాన్ - 810 జీబీ డేటా (నాన్ ప్రైమ్‌ కు 750 జీబీ), రోజూ ఎలాంటి డేటా లిమిట్ లేదు, 420 రోజుల వాలిడిటీ (నాన్ ప్రైమ్‌కు 360 రోజుల వాలిడిటీ)

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/