ఎవరీ లింగాయత్ లు..బీజేపీని ఎందుకు గెలిపించారు.?

Wed May 16 2018 17:05:29 GMT+0530 (IST)

కర్ణాటక గెలుపోటముల్లో లింగాయత్ లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఇప్పుడు వారంతా బీజేపీకి మద్దతు తెలుపడంతో మెజార్టీ సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. లింగాయత్ అను ఆకర్షించడానికి వారికి ప్రత్యేక మతం - రిజర్వేషన్లు ఇస్తానన్న కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య పాచిక పారలేదు. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ లింగాయత్ లు - వారిదే కులం - మతం - ఎంతమేరకు కర్ణాటక ఎన్నికల్లో ప్రభావం చూపారో తెలుసుకుందాం..*లింగాయత్ లు ఎవరంటే..

బసవతత్వాన్ని అనుసరించేవారిని లింగాయత్ లు అంటారు. వీరశైవం వీరి మతం.. 12వ శతాబ్ధం కాలం నాటి బసవేశ్వరుని బోధనలతో పురుడుపోసుకున్న లింగాయుతం హిందూ బ్రహ్మాణవాదంపై తిరుగుబాటుగా దేశీయంగా వచ్చిన మతవాద సంస్మరణోధ్యమాల్లో బౌద్దం తర్వాత అంతటి ప్రాధాన్యం విశిష్టత తెచ్చుకుంది. శతాబ్దాలుగా దక్షిణ భారత రాష్ట్రాలన్నింటిలో వీరు విస్తరించారు. కర్ణాటకలో అయితే వీరు సంఖ్యాపరంగా సామాజికపరంగా ప్రభావశీలురుగా ఉన్నారు.

వీరు 2003 నుంచి ప్రత్యేక మతం కోసం ఆందోళన చేస్తున్నారు. కర్ణాటకలో లింగాయత్ లు 17శాతం జనాభాగా ఉన్నారు. 224 అసెంబ్లీ స్థానాల్లో వందకుపైగా నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఇప్పటికే లింగాయత్ లకు కన్నడనాట 15శాతం రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తామన్న ప్రత్యేక మతం హోదాతో వచ్చేది ఏమీ లేదు. అందుకే  బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న తమ కులస్థుడైన యడ్యూరప్ప కే ఆ  సామాజిక వర్గం వారు ఓట్లు వేసి గెలిపించారు. కాంగ్రెస్ వాళ్లు  తమకు రిజర్వేషన్లు ఇస్తామన్నా కూడా తమ కులానికి చెందిన యడ్యూరప్పకే లింగాయత్ లు మద్దతు తెలిపి బీజేపీని గెలిపించారు.