Begin typing your search above and press return to search.

దిల్ రాజుకు ఎందుకు టీటీడీ పదవి దక్కలేదు?

By:  Tupaki Desk   |   22 Sep 2019 8:09 AM GMT
దిల్ రాజుకు ఎందుకు టీటీడీ పదవి దక్కలేదు?
X
టీటీడీ నూతన బోర్డు ఏర్పాటుకు సంబంధించి వార్తలు వచ్చినప్పుడే ఆ విషయంలో దిల్ రాజు పేరు ప్రముఖంగా వినిపించింది. వెంకటేశ్వరుడి పేరు మీద బ్యానర్ నడుపుతూ సినిమాలు రూపొందిస్తున్న వ్యక్తి దిల్ రాజు. తమ ప్రతి సినిమా ఆరంభంలో వెంకటేశ్వరుడి శ్లోకం తప్పనిసరి. ఇక ప్రముఖ నిర్మాతగా ఎదిగారు. రాజకీయ నేతలతోనూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు.

ఇలాంటి నేపథ్యంలో దిల్ రాజుకు టీటీడీ బోర్డులో స్థానం దక్కుతుందని వార్తలు వచ్చాయి. తెలంగాణ కోటా నుంచి ఆయనకు స్థానం దక్కవచ్చిన ఊహాగానాలు వినిపించాయి. సినీ ప్రముఖుడు కాబట్టి చోటు దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదని చాలా మంది అభిప్రాయపడ్డారు.

అయితే అంతిమంగా దిల్ రాజుకు ఆ అవకాశం దక్కలేదు. దీనికి కారణం ఏమిటి? అంటే.. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సిఫార్సు రాకపోవడమే అని పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం దిల్ రాజు పేరును సిఫార్సు చేసి ఉంటే.. ఆయనకు చోటు దక్కేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

దిల్ రాజుకు ఏపీ రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేనట్టే. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి సిఫార్సు వచ్చి ఉంటే మాత్రమే ఆయనకు ఆ అవాకశం దక్కుతుంది. లేకపోతే లేదు.

తెలంగాణ సీఎం కేసీఆర్ సినిమా వాళ్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. వారితో ఉపయోగం లేదని ఆయన ఫిక్సయ్యారు. అందుకే దిల్ రాజు పేరును సిఫార్సు చేసినట్టు లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు టీటీడీ బోర్డు జాబితాలో దిల్ రాజు పేరు లేదని అభిప్రాయపడుతున్నారు.