జగన్ కోసం ఆగుతున్న టీడీపీ..!

Mon Mar 25 2019 20:00:01 GMT+0530 (IST)

నాలుగు రోజుల కిందటే తమ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోని విడుదల చేస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ సారి కూడా తెలుగుదేశం పార్టీ మెనిఫెస్టో భారీ ఎత్తున ఉండబోతోందని - ఏకంగా డెబ్బై నాలుగు పేజీల సైజులో ఒక బుక్కులాగా మెనిఫోస్టోని తయారు చేసిందట తెలుగుదేశం పార్టీ. గత ఎన్నికల ముందు కూడా తెలుగుదేశం పార్టీ భారీ మెనిఫెస్టోని తయారు చేసింది. అనేక వరాలను అందులో గుప్పించింది. కులాల వారీగా - మతాల వారీగా - వర్గాల వారీగా బోలెడన్ని హామీలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ.తీరా ఎన్నికలు అయ్యాకా - అధికారం సాధించుకున్నాకా తెలుగుదేశం పార్టీ మెనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి తొలగించింది తెలుగుదేశం పార్టీ. పదే పదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు తెలుగుదేశం పార్టీ మెనిఫెస్టోలోని అంశాలను ప్రస్తావిస్తూ ఉంటే వాటి అమలు గురించి ప్రశ్నిస్తూ ఉంటే..  తెలుగుదేశం పార్టీ వాళ్లు మెనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి తీసేశారు. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీ మెనిఫెస్టోని అదే స్థాయిలో రెడీ చేస్తోందట.

కానీ అది ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా -  విడుదల కాలేదు. ఎందుకు? అంటే.. ఈ విషయంలో జగన్ కోసం ఎదురుచూస్తోందట తెలుగుదేశం పార్టీ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టో విడుదల అయితే అందులో జగన్ ఏయే వరాలను ఇచ్చారో గమనించి.. వాటిని మక్కికి మక్కిగా దింపేందుకే తెలుగుదేశం పార్టీ మెనిఫెస్టో విడుదలను వాయిదా వేసిందని భోగట్టా.

ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హామీల్లో కొన్నింటిని తెలుగుదేశం పార్టీ కాపీ చేసేసింది. జగన్ హామీలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెట్టే ప్రయత్నం చేసింది. ఇలాంటి నేపథ్యంలో మెనిఫెస్టోలో కూడా అదే ఉండబోతోందని.. జగన్ మెనిఫెస్టోని విడుదల చేస్తే అందులోని కాపీ పేస్ట్ చేసేందుకు అనుగుణంగా టీడీపీ తమ మెనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసిందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.