Begin typing your search above and press return to search.

అవిశ్వాసం చ‌ర్చ‌కు రాని లోగుట్టు ఇదేన‌ట‌!

By:  Tupaki Desk   |   21 March 2018 11:34 AM GMT
అవిశ్వాసం చ‌ర్చ‌కు రాని లోగుట్టు ఇదేన‌ట‌!
X
ఎవ‌రు ఎన్ని చెప్పినా ఒక‌టి మాత్రం నిజం. ఆంధ్రోడికి మోసం చేసినోడు.. అన్యాయం చేయాల‌నుకున్నోడు బాగుప‌డిన దాఖ‌లాలు ఇప్ప‌టివ‌ర‌కూ లేవు. ఏపీకి థోకా ఇవ్వాలని ప్ర‌య‌త్నించిన వారు స‌క్సెస్ అయినా.. అది తాత్కాలిక‌మే కానీ.. అంత‌కంత అనుభ‌వించిన వైనం ఇప్ప‌టికే ప‌లుమార్లు రుజువైంది. రాబోయే రోజుల్లో రుజువు కానుంది కూడా.

తిరుప‌తి లాంటి పుణ్య‌క్షేత్రంలో వెంక‌న్న సాక్షిగా ఇచ్చిన మాట‌ను త‌ప్పిన మోడీకి బ్యాడ్ టైం మొద‌లైంద‌న్న మాట.. కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన రోజున ఏపీలో చాలామంది నోట వినిపించింది.

దీన్ని పెద్ద‌గా తీసుకొని వారికి.. తాజా ప‌రిస్థితులు చూస్తే.. వారు చెప్పిన మాట‌ల్లో నిజం పాళ్లు ఎంత‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా మీద ప‌డుతున్న వైనాల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మోడీ.. త‌న ప‌ట్టును ప్ర‌ద‌ర్శించుకోవ‌టానికి సామ‌దాన దండోపాయాల్ని ఉప‌యోగించాల్సి వ‌స్తోంద‌ని చెబుతున్నారు.

ఎక్క‌డిక‌క్క‌డ త‌మ ప‌వ‌ర్ తో ఇష్యూల‌ను సెట్ చేస్తున్న మోడీ.. అమిత్ షాల‌కు ప్ర‌త్య‌ర్థుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతున్న‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు. ఎక్క‌డిదాకానో ఎందుకు.. ఏపీ హోదా కోసం ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం (త‌ర్వాత ఏపీ అధికార‌పక్షం కూడా అవిశ్వాస తీర్మానాన్ని పెట్టింది) విష‌య‌మే చూస్తే.. ఇప్ప‌టికి నాలుగు ద‌ఫాలుగా లోక్ స‌భ‌లో స్పీక‌ర్ టేబుల్ మీద‌కు వ‌చ్చినా.. చ‌ర్చ‌కు మాత్రం రాని ప‌రిస్థితిని మ‌ర్చిపోకూడ‌దు.

టీవీలు చూస్తున్న వారికి.. మీడియాలో వార్త‌లు చ‌దువుతున్న వారంద‌రికి.. టీఆర్ ఎస్‌.. అన్నాడీఎంకే ఎంపీల ఆందోళ‌న కార‌ణంగా చ‌ర్చ‌కు రావ‌టం లేద‌న్న భావ‌న క‌లుగుతుంది. కానీ.. వాస్త‌వం అది కాద‌ని చెబుతున్నారు. నిజంగా.. అవిశ్వాసం మీద చ‌ర్చ‌ను చేప‌ట్టాల‌ని బీజేపీ బ‌లంగా అనుకుంటే.. స‌భ జ‌ర‌గ‌కుండా ఆందోళ‌న చేస్తున్న టీఆర్ ఎస్‌.. అన్నాడీఎంకే స‌భ్యుల్ని రెండు రోజులు స‌స్పెండ్ చేస్తే స‌రి. తెలంగాణ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌లు నోరు తెరిస్తే చాలు.. వేటు వేసేస్తున్న కేసీఆర్ స‌ర్కారు.. మ‌రి.. లోక్ స‌భ‌లో అందుకు భిన్నంగా వెల్ లోకి ఎలా దూసుకెళుతుంద‌న్న‌ది అస‌లు రాజ‌కీయంగా చెప్పాలి.

ఇంత‌కూ అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాక‌పోవ‌టానికి కార‌ణాల్లో ముఖ్య కార‌ణం మోడీ స‌ర్కారుకున్న భ‌యంగా చెబుతారు. లోక్ స‌భ‌లో భారీగా బ‌లం ఉన్న బీజేపీ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం ఏమిటంటే.. మోడీ తీరుతో బీజేపీ ఎంపీలు పలువురు నారాజ్ గా ఉన్నార‌ని.. ప్ర‌ధానిని అస్స‌లు లెక్క చేయ‌టం లేద‌ని చెబుతున్నారు. అన్నింటికి మించి స‌భ‌కు స‌భ్యులంతా హాజ‌రు కావాలని చెప్పినా.. వారు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదంటున్నారు.

ఒక‌వేళ అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు వ‌చ్చి.. విప‌క్షాల‌న్నీ హాజ‌రై.. బీజేపీ ఎంపీలు పెద్ద ఎత్తున గైర్హాజ‌రు అయితే ప్ర‌బుత్వానికి ఎదుర‌య్యే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అందుకే.. ఇలాంటి తిప్ప‌లు ఎదురు కాకుండా ఉండేందుకు అస‌లు అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాకుండానే లోపాయికారీ వ్య‌వ‌హారాన్ని న‌డిపిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇందులో వాస్త‌వం ఎంత ఉన్నా.. లాజిక్ కు సరిపోయేట‌ట్లుఉండ‌టం గ‌మ‌నార్హం.