Begin typing your search above and press return to search.

ఢిల్లీలోని ఓ వ్యక్తికి సీఎం రమేష్ డబ్బు.?

By:  Tupaki Desk   |   14 Oct 2018 7:03 AM GMT
ఢిల్లీలోని ఓ వ్యక్తికి సీఎం రమేష్ డబ్బు.?
X
టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ పై ఐటీ దాడుల వెనుక పెద్ద హవాలా కుంభకోణమే ఉందా.? రెండు రోజుల పాటు సీఎం రమేష్ ఇళ్లు - కార్యాలయాలపై దాడుల వెనుక రిత్విక్ సంస్థలకు సంబంధించిన పెద్ద లావాదేవీలు ఉన్నాయా? వేల కోట్లను విదేశాలకు - ఏపీలోని కొందరికి చేరవేయడంతోనే సీఎం రమేష్ ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయా.? అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీలోని ఐటీ అధికార వర్గాలు..

*సీఎం రమేష్ పై ఐటీ దాడులు వెనుక కారణమిదే..
‘రిత్విక్ సంస్థలు..’ సీఎం రమేష్ కు చెందిన కాంట్రాక్ట్ కంపెనీల పేరు ఇదీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టుల్లో మెజార్టీ పనులను సీఎం రమేష్ సారథ్యంలోని ఈ సంస్థలే దక్కించుకున్నాయి. ఇప్పుడీ రిత్విక్ సంస్థలకు సంబంధించిన కొన్ని లావాదేవీల పై ప్రధానంగా దృష్టి సారించిన ఐటీ అధికారులు ఢిల్లీలోని ఓ వ్యక్తికి వేల కోట్ల రూపాయలను చేరవేసినట్లు గుర్తించారని సమాచారం. 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారీస్థాయిలో పెరిగిన కంపెనీ లావాదేవీల పై అనుమానాలతో ఐటీ శాఖ ఈ దాడులు నిర్వహించినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

*పనులు చేయకుండా చెల్లింపులా.?
ఎన్నో వేల కోట్ల ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకున్న రిత్విక్ సంస్థ పనులు చేయకుండానే ప్రభుత్వ ప్రోత్సాహంతో రికార్డుల్లో పనులు చేసినట్టు చూపించి నిధులు బొక్కేసిందని ఐటీ సోదాల్లో బయటపడినట్టు వార్తలొస్తున్నాయి. అంతేకాదు.. సాగునీటి ప్రాజెక్టుల నిధుల గోల్ మాల్ లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయట.. పనులు చేయకుండానే వేలకోట్లను రిత్విక్ సంస్థ డ్రా చేసుకున్నట్టు సోదాల సందర్భంగా ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ వేల కోట్లను ఢిల్లీలోని ఓ వ్యక్తి వద్దకు తరలించారని నిర్ధారించుకున్నాకే సీఎం రమేష్ పై ఐటీ దాడి జరిగిందని ఐటీ అధికారులు చెబుతున్నారట.. అయితే ఈ వేల కోట్లను హవాలా రూపంలో విదేశాలకు తరలించారా.? లేక ఏపీలోని కొందరు వ్యక్తులు, సంస్థలకు మళ్లించారా అనే కోణంలో ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారట..

*అంతా నగదు రూపంలోనే లాగేశారా.?
రిత్విక్ కంపెనీకి చెందిన మరో ఆరు కంపెనీలపై ఐటీ అధికారులు ఆరాతీస్తున్నారు. ఓ ప్రాజెక్టులో రూ.1800 కోట్లు, మరో ప్రాజెక్టులో రూ.900 కోట్ల బిల్లులను నగదు రూపంలోనే రిత్విక్ కంపెనీకి చేరాయని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. వాటికి సంబంధించిన పన్నులను రిత్విక్ కంపెనీ ఎగ్గొట్డడంతోనే ఐటీ అధికారులు దాడులు చేసినట్టు చెబుతున్నారు. రిత్విక్ అనుబంధ ఒక్క కంపెనీ ద్వారా 2వేల కోట్లకు పైగా నగదు లావాదేవీ జరిగిందని.. ఈ కోట్ల లెక్కలపై విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాజెక్టు డబ్బులను సాధారణంగా ఆన్ లైన్ చెల్లింపులు లేదా ఆర్టీజీఎస్/చెక్కుల రూపంలో తీసుకోవాలి. కానీ రిత్విక్ సంస్థ వందల కోట్లను నగదు రూపంలో స్వీకరించడంతోనే ఐటీ అధికారులకు దొరికిపోయినట్లు సమాచారం. దీనిపై పన్నులు చెల్లించడంలో తేడాలున్నాయట.. మూడేళ్ల ఐటీ రిటర్న్స్ లో లాభాలు, పెట్టుబడులు భారీగా పెరగడంపై సోదాలు చేస్తున్నట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు.

*లాకర్లలో బట్టలు కాదు.. డాక్యుమెంట్లు, బ్యాంకు డిటైల్స్
సీఎం రమేష్ ను ఢిల్లీ నుంచి హైదరాబాద్ రప్పించడానికి ఐటీ అధికారులు కష్టపడ్డారు. సీఎం రమేష్ ఇంట్లోని రెండు డిజిటల్ లాకర్లు వేలిముద్రల సాయంతోనే తెరుచుకుంటాయట.. అదీ సీఎం రమేష్ వేలిముద్రలే.. అందుకే ఢిల్లీ నుంచి రమేష్ ను రప్పించి ఆ లాకర్లు తెరిచారు. అందులో ఏపీ ప్రాజెక్టులకు సంబంధించిన ఫైళ్లు, పాత అంచనాలు, 3 బ్యాంకు ఖాతాల వివరాలు, చెక్ బుక్ లు, 2 పెన్ డ్రైవ్ లు, ఐటీ రిటర్న్స్ ల కాపీలు లభ్యమైనట్లు తెలిసింది. కానీ విలేకరుల సమావేశంలో మాత్రం సీఎం రమేష్ తన లాకర్లలో డాక్యుమెంట్లు, ఐటీ రిటర్న్స్ ల ఫైళ్లు తదితరాలు బయటపడలేదని.. కేవలం తన బట్టలు మాత్రమే ఉన్నాయని చెప్పడం కొసమెరుపు.

*రమేష్, ఆయన బావమరిది గోవర్ధన్ పై విచారణ
సోదాల అనంతరం సీఎం రమేష్ తోపాటు ఆయన బావమరిది రిత్విక్ కంపెనీ డైరెక్టర్ గోవర్దన్ నాయుడులను ఐటీ అధికారులు విచారించారు. హైదరాబాద్ లోని రిత్విక్ కంపెనీ కార్యాలయంలో రమేష్ సోదరుడు రాజేష్ ను సైతం విచారించారు. కంపెనీలో పెట్టుబడులు పెరగడం..వాటి షేర్ల విలువ పెరగడం, ఫైలింగ్ లో వ్యత్యాసాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. త్వరలోనే కంపెనీకి సంబంధించిన ఆరుగురికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలువనున్నట్లు సమాచారం. సీఎం రమేష్ ఇంటికి సంబంధించిన విషయంలో ఆయన భార్యకు కూడా అధికారులు నోటీసులిచ్చినట్లు తెలిసింది.