Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు కేంద్రంపై కోపమెందుకొచ్చింది?

By:  Tupaki Desk   |   1 Dec 2017 5:25 AM GMT
చంద్రబాబుకు కేంద్రంపై కోపమెందుకొచ్చింది?
X
రుణ‌మాఫీని అస్త‌వ్య‌స్తం చేసి రైతుల్లో ఇమేజ్ కోల్పోయిన బాబు పోల‌వ‌రంతో ఆ న‌ష్టం పూడ్చుకోవాల‌నుకుని కొంత‌కాలంగా తెగ ట్రై చేస్తున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎల‌క్ష‌న్ల కోసం... బాబు న‌మ్ముకున్న రెండు... అమ‌రావ‌తి - పోల‌వ‌రం. ఇపుడు మోడీ బాబు పోల‌వ‌రం ఆశ‌ల‌పై దెబ్బేశాడు. సీఎం చంద్రబాబు సడెన్‌ గా కేంద్రంపై మండిపడ్డారు. పోలవరం విషయంలో ఆయన ఫ్రస్ట్రేషన్ కొట్టొచ్చిన‌ట్లు క‌న‌ప‌డింది. కేంద్రం తీరు మారకపోతే - పోలవరం ప్రాజెక్టును ఆపేస్తామంటూ కేంద్రాన్ని బెదిరించి ప్ర‌య‌త్నం చేశారు. నిజానికి పోల‌వ‌రం ఆపితే న‌ష్టం కేంద్రానికి కాదు - చంద్ర‌బాబుకు. ఎందుకంటే అన్నిట్లో విఫ‌ల‌మైన బాబు ఒకే ఒక్క ఆశ పోల‌వ‌రం. దాని మీద దెబ్బ ప‌డేట‌ప్ప‌టికి కేంద్రం ఇంతవరకు ఏపీకి ఏమిచ్చిందో ఏం ఇవ్వలేదో లెక్కల చిట్టాను అసెంబ్లీలో విప్పారు. అయితే.. చంద్రబాబుకు ఇంతకాలం లేనిది ఒక్కసారిగా ఇప్పుడు కోపమెందుకు వచ్చింది... ఆయన ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించారన్న విషయంలో రాజకీయ వర్గాలు పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అత్త తిట్టినందుకు కంటే తోడి కోడలు నవ్విందుకే ఎక్కువ బాధపడినట్లుగా ఉందన్న సామెతను గుర్తు చేస్తున్నారు.

చంద్రబాబుకు చాలాకాలంగా మోడీ ప్రయారిటీ తగ్గించేశారు. చంద్రబాబు మాట కేంద్రంలో చెల్లుబాటు కావడం లేదు - ఏపీకి సంబంధించిన పనులు కావడం లేదు.. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుకు అసలు మోదీ అపాయింటుమెంటే దొరకడం లేదు. దీంతో ఇప్పటికే చంద్రబాబుకు మోదీపై పీకల్దాకా కోపం ఉందని చెబుతుంటారు.

ఇదే సమయంలో మోదీ చంద్రబాబుకు గిట్టనివారితో చెట్టపట్టాలేస్తున్నారు. ఇంతకుముందు హైదరాబాద్ వచ్చినప్పుడు విమానం దిగగానే కేసీఆర్ చేతిలో చెయ్యేసి పక్కకు తీసుకెళ్లి ముచ్చటించారు. అలాగే ఏపీ విపక్ష నేత జగన్‌ కు అపాయింటుమెంటు ఇచ్చి దిల్లీలో ఆయన చెప్పిందంతా విన్నారు.

అలాగే... నిధుల విషయంలోనూ చేసిన ఖర్చులకు కేంద్రం పక్కా లెక్కలు అడుగుతోంది. పోలవరానికి నిధులు అరకొరే. చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల పెంపు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి కొంచెం కూడా సానుకూలత లేదు.

అమరావతికి సాయం అంతంతమాత్రమే... విశాఖకు రైల్వే జోన్ ఊసే లేదు. చంద్రబాబు ఖర్చులకు మోదీ ఇస్తున్న నిధులకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు. దీంతో చంద్రబాబు ఇప్పటికే రగిలిపోతున్నారు.

ఇది చాలదన్నట్లుగా హైదరాబాద్‌ లో తాజాగా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు జరగడం.. దానికి ఇవాంకా ట్రంప్ రావడం.. హైదరాబాద్ కు మెట్రో రైలు రావడం. అన్నీ ఒకేసారి జరగడంతో లోకల్ నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకు అంతటా ఇదే కవరేజి.

ఇది చాలదన్నట్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లోనూ ఈసారి కూడా తెలంగాణ టాప్ లో నిలవనుందని కేంద్ర అధికారుల నుంచి టీడీపీ నేతలకు సమాచారం అందిందట. దాని ప్రకారం ఏపీ ర్యాంకు బాగా తగ్గిందట కూడా. ఇవన్నీ కలిసి చంద్రబాబు తీవ్ర ఫ్రస్ట్రేషన్‌ కు లోనై కేంద్రంపై ఒక్కసారిగా ఫైరయినట్లు అంచనా వేస్తున్నారు.