Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీ ఎంత అడ్వాన్స్ గా ఉన్నాడో క‌దా?

By:  Tupaki Desk   |   22 Oct 2016 7:03 AM GMT
టీడీపీ ఎంపీ ఎంత అడ్వాన్స్ గా ఉన్నాడో క‌దా?
X
ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీల ప్ర‌క‌ట‌న‌లు ఆస‌క్తిక‌రంగా ఉంటాయ‌ని ప‌లువురు వ్యాఖ్యానించ‌డం స‌త్య‌దూర‌మేమీ కాద‌ని మ‌రోమారు రుజువైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా అంశాన్నే తీసుకుంటే...ఢిల్లీలో ఏం జ‌రుగుతుందో మాకు తెలియ‌దా? హోదా వ‌చ్చే చాన్సే లేదు అంటూ అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కుండ‌బద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పేవారు. అయితే టీడీపీకే చెందిన కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి మాత్రం హోదా ఇదిగో అంటూ తేదీల‌తో ప్ర‌క‌టించేవారు. స్పెష‌ల్ స్టేట‌స్ లేద‌ని తేల్చేసిన త‌ర్వాత ఆయ‌న మీడియాకు దూరంగా ఉంటున్న‌ది వేరే విష‌యం. ఇపుడు ఇలాగే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేసే ఎంపీల కోవ‌లోకి నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు చేరారు.

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌లు ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు గురించి రాయ‌పాటి ఆస‌క్తిక‌ర‌మైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల‌ డీ లిమిటేషన్‌ కు కేంద్రప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పిన రాయ‌పాటి ఇందుకు త‌గిన స‌మయాన్ని సైతం వెల్ల‌డించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోగా ఈ ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌ని రాయ‌పాటి తెలిపారు. గుంటూరులోని తన నివాసంలో ఎంపీ రాయపాటి విలేఖర్లతో మాట్లాడారు. అసెంబ్లీ స్థానాల పెంపునకు ప్రధాని నరేంద్రమోడీ సానుకూలంగా స్పందించారని - ప్రతి పార్లమెంటు సెగ్మెంట్‌ కు రెండు అసెంబ్లీ స్థానాలు పెంచేందుకు అవకాశం ఉందన్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో పరిపాల‌న‌పై రాయ‌పాటి స్పందించారు. సచివాలయం ఏర్పడినంత మాత్రాన కేవలం హైదరాబాద్ నుంచి ఉద్యోగులు ఇక్కడకు తరలివస్తారని అదనంగా పోస్టులేవీ రావని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో గుంటూరు జిల్లాలో రైతులు 34 వేల ఎకరాలను ఇచ్చారని చెప్పిన రాయ‌పాటి రాజధాని వచ్చినంత మాత్రాన ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనమేదీ లేదన్న అభిప్రాయంలో రైతాంగం ఉన్నారని సొంత ప్ర‌భుత్వంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/