Begin typing your search above and press return to search.

రాయపాటి వారసుడికే సత్తెనపల్లి.. రీజ‌న్ ఇదేనా...?

By:  Tupaki Desk   |   12 Oct 2019 8:15 AM GMT
రాయపాటి వారసుడికే సత్తెనపల్లి.. రీజ‌న్ ఇదేనా...?
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో రాజ‌కీయ దుమారం రేగుతోందా? పార్టీ సీనియ‌ర్ నాయకుడు - మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్య చేసుకున్న నేప‌థ్యంలో ఆయ‌న ఏకైక వార‌సుడు కోడెల శివ‌రామ కృష్ణ‌ కు స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌కవ‌ర్గం క‌ట్ట‌బెట్టేందుకు పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు. ఆదిలో ఆయ‌న వ‌ద్ద‌ని అనుకున్నా.. ఆ కుటుంబానికి అండ‌గా ఉండాల్సిన నేప‌థ్యంలో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. నిజానికి గుంటూరు రాజ‌కీయాల్లో మ‌రో ముఖ్య నేత‌గా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న వారసుడిగా రాయ‌పాటి రంగారావును రంగంలోకి దించాల‌ని చూస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను త‌న కుమారుడికి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే, దీనిపై చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేక పోవ‌డంతో ఏకంగా పార్టీ మారిపోయేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. అయితే, ఇప్పుడు స‌త్తెన‌ప‌ల్లిని ఎవ‌రికి ఇస్తారు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు కోడెల శివ‌రామ్‌ కు ఇస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. అయితే, దీనిని స్థానికంగా ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌ని చంద్ర‌బాబుకు నివేదిక‌లు అందాయి. ఇప్ప‌టికే ప‌లు కేసుల్లో ఉన్న శివ‌రామ్‌.. వాటి నుంచి ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్నారు.

అయితే, స‌ద‌రు కేసుల విచార‌ణ మాత్రం కొన‌సాగుతోంది. ఆయా కేసుల‌కు సంబంధించి ఇప్ప‌టికే వారాని కి రెండు సార్లు.. పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి సంత‌కాలు చేయాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో శివ‌రామ్‌ కు ఈ నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌లు అప్ప‌గించినా.. వృధా అనే చ‌ర్చ సాగుతోంది. పైగా వ్య‌క్తిగ‌త ద్వేషాల కార‌ణంగా ఆయ‌న‌ను ఏ పార్టీ కూడా చేర్చుకునేందుకు ముందుకు రావ‌డం లేదు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టి.. ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి బాగుంటే.. మ‌రో నియోజ‌క‌వ‌ర్గం ఇచ్చేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తు న్నారు. ఇప్ప‌టికిప్పుడు మాత్రం రాయ‌పాటి కుటుంబాన్ని శాంత ప‌రిచేందుకు ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లిని రంగారావుకు ఇవ్వాల‌ని డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.