రవిప్రకాష్ వీడియో సందేశం ఇదే

Wed May 22 2019 13:51:35 GMT+0530 (IST)

రవి ప్రకాష్.. తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులు మోస్ట్ వాంటెడ్ పర్సన్. టీవీ 9 క్రయవిక్రయాల్లో మైనర్ వాటాదారు అయిన రవి ప్రకాష్ వివాదాస్పందంగా వ్యవహరించినట్లు ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు ఆయన ఆఫీసు ఇళ్లలో సోదాలు చేశారు. నోటీసులు ఇస్తే వేటికీ రవిప్రకాష్ స్పందించలేదు. అజ్ఞతంలో ఉండిపోయి అజ్ఞతంలో నుంచే లాయరు ద్వారా ముందస్తు బెయిల్ కో కోర్టులో పిటిషను వేసినా ఆయనకు అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో ఆయన ఇప్పటికీ ఎక్కడున్నారో తెలియడం లేదు. తాజాగా తన వీడియో సందేశాన్ని ఆయన మీడియాకు విడుదల చేశారు. తనపై పెట్టినవి తప్పుడు కేసులుగా కొట్టి పారేశారు.కుట్రపూరితంగా రామేశ్వరరావు టీవీ9 లో ప్రవేశించారని - రాజమార్గంలో రాలేదన్నారు. ఒక ప్రముఖ వ్యక్తిని  ముందు పంపి తర్వాత మొత్తం రామేశ్వరరావు కొనేసుకున్నారని - ఆయన తనను పాలేరులా పనిచేయమన్నారని ఒక వాటాదారుగా తనకు అగ్రిమెంటు ఇవ్వలేదన్నారు. పోలీసులు కూడా రామేశ్వరరావు చెప్పినట్టు వింటున్నారని రవి ప్రకాష్ ఆరోపించారు. పోలీసులు రామేశ్వరరావు పార్ట్ నర్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎవరేం చేసినా నేను నమ్మిన విలువల కోసం ముందుకు పోవాలని నిర్ణయించుకున్నానని రవి ప్రకాష్ వెల్లడించారు.