Begin typing your search above and press return to search.

బాహుబలి పెళ్లి అయిపోయింది

By:  Tupaki Desk   |   27 Nov 2015 5:27 AM GMT
బాహుబలి పెళ్లి అయిపోయింది
X
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకున్న బాహుబలి చిత్రం ఇప్పుడు పెళ్లి వేడుక‌ల‌కూ వేదిక‌గా మారుతోంది. బాహుబ‌లిలోని మాహిష్మతి రాజ్యం తరహాలో వేసిన సెట్టింగులో ఓ జంట పెళ్లి చేసుకుంది.

కేరళకు చెందిన రవి పిళ్ళై అనే ఎన్నారై గల్ఫ్ లో ఆర్పీ గ్రూప్ ని నిర్వహిస్తున్నారు. ఆయనకు దేశ వ్యాప్తంగా 26 కంపెనీలు ఉన్నాయి.ఈ ఏడాది జూన్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో కేరళ ఎన్నారై లలో అత్యధిక సంపన్నుల జాబితాలో రవి పిళ్లై మొదటి స్థానంలో నిలిచారు. అలాంటి కుబేరుడి గారాల పట్టి డాక్టర్ ఆరతీ వివాహాన్ని బాహుబలి సెట్ లో చేశారు. ఆరతిని కొచ్చికి చెందిన డాక్టర్ ఆదిత్య విష్ణుకి ఇచ్చి గురువారం వివాహం చేశారు. ఇందుకు ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ తో బాహుబలి తరహాలో పెళ్లి సెట్టింగ్ వేయించారు. ఈ పెళ్లి వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ - సినీ - వ్యాపార ప్రముఖులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 42 దేశాల ప్రభుత్వ అధినేతలను ఆహ్వానించారు. ప్రముఖులను వివాహ వేడుక వద్దకు తరలించేందుకు తిరువనంత పురం ఎయిర్ పోర్ట్ నుంచి రెండు చార్టెడ్ ఫ్లైట్ లను ఏర్పాటు చేశారు. పెళ్లి వేడుకలో ఆహూతుల‌ను అల‌రించేందు కు నటి శోభన - మంజు వారియర్ తో డాన్స్ ప్రొగ్రాం ఏర్పాటు చేశారు.