Begin typing your search above and press return to search.

మళ్లీ వివాదంలో ఇరుక్కున్న మంత్రి రావెల

By:  Tupaki Desk   |   28 Oct 2016 6:07 AM GMT
మళ్లీ వివాదంలో ఇరుక్కున్న మంత్రి రావెల
X
ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు నేరుగా తనకు సంబంధం లేకపోయినా తనవారి కారణంగా తరచూ మహిళలకు సంబంధించిన వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రావెల తనయుడు గత ఏడాది ఏకంగా నిర్భయ కేసులో చిక్కుకున్నారు. హైదరాబాద్‌ లో ఒక మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా రావెల కుమారుడు ఆమెను వెంబడించి చేయి పట్టుకుని లాగగా స్థానికులనే చితక్కొట్టారు. దీంతో వ్యవహారం పోలీసుల వరకు వెళ్లి మంత్రి కుమారుడిపై నిర్భయ కేసు కూడా నమోదైంది. తాజాగా రావెల మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన అనుచరులకు అమ్మాయిల హాస్టల్ లో బస ఏర్పాటు చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది.

గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌ లో మెగా రుణమేళా నిర్వహించగా… రావెల అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చారట. వారందరికీ బస ఏర్పాటు చేయించాలని మంత్రి ఆదేశించడంతో అధికారులు రావెల అనుచరులకు కలెక్టరేట్ రోడ్డులోని పరివర్తన భవన్‌ లో బస ఏర్పాటు చేయించారు. అయితే ఈ భవనంలోనే సాంఘిన సంక్షేమ శాఖకు చెందిన బాలికల పోస్టు మెట్రిక్‌ హాస్టల్‌ నడుస్తోంది. బాలికలు ఉండే చోట మగవారికి ఆశ్రయం కల్పించకూడదని నిబంధన ఉన్నప్పటికీ మంత్రి అనుచరుల కోసం దాన్ని పక్కన పెట్టారు. కొందరు అధికారులు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఆయన లైట్ గా తీసుకున్నారనిచెబుతున్నారు.

కాగా గతంలో హైదరాబాదులో తన తనయుడు నిర్భయ కేసులో చిక్కుకున్నప్పుడు మంత్రి తొలుత కంగారు పడినా ఆ తరువాత కేసు మేనేజ్ చేసేశారు. బాధితురాలితో రాజీకొచ్చి కోర్టులో ఆమె అడ్డం తిరిగేలా చేశారన్న విమర్శలున్నాయి. అలాగే .. ఆ తరువాత మంత్రి కుమారుడు అర్థరాత్రి మద్యం తాగి స్నేహితులతో కలిసి అమ్మాయిల హాస్టల్‌ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఘటనలోనూ కొంత ఇబ్బందులు పడినా పోలీసులను మేనేజ్ చేసి కామ్ చేశారని చెబుతారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/