Begin typing your search above and press return to search.

కరెంట్ చౌర్యానికి పాల్పడ్డ సీనియర్ నటి!

By:  Tupaki Desk   |   20 Jan 2017 11:48 AM GMT
కరెంట్ చౌర్యానికి పాల్పడ్డ సీనియర్ నటి!
X
కక్కుర్తికి కాదేదీ అనర్హం.. కక్కుర్తికి కారెవరూ అనర్హం అన్నట్లుగా సాగిన ఒక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అవడానికి ఆమె ఒక సీనియర్ నటి.. ఇటు టాలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ కూడా నటిగా ఆమెకు మంచి పేరుంది.. అయితేనేం... బుద్ది మాత్రం కాస్త కక్కురి పని చేసింది.. ఫలితంగా ఆమెపై సెక్షన్ 135 కింద కేసు నమోదైంది! ఇంతకూ ఈమె చేసిన పనేమిటంటారా... విద్యుత్ చౌర్యం!

వివరాళ్లోకి వస్తే... సీనియర్ నటి రతి అగ్నిహోత్రి - ఆమె భర్త అనిల్ వీర్వానీ కలిసి మొత్తం రూ. 48.96 లక్షల విలువైన కరెంట్ చౌర్యానికి పాల్పడ్డారట. ఈ విషయాన్ని వెల్లడించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ముంబై వోర్లీ ఏరియాలోని స్టెర్లింగ్ సీ ఫేస్ ఫ్లాట్ లో ఉంటున్న ఈ జంట.. విద్యుత్ మీటర్లను టాంపరింగ్ చేసినట్లు తాజాగా అధికారులు గుర్తించారు. ఈ టాంపరింగ్ లో భాగంగా 2013 నుంచి ఇప్పటివరకూ సుమారు లక్షా 77 వేల 647 యూనిట్ల విద్యుత్తును వీరు అక్రమంగా వాడుకున్నారట. తాజాగా వీరి ఇంటి కరెంట్ మీటర్లను తనిఖీ చేసిన విద్యుత్ శాఖాధికారులు ఈ విషయాన్ని కనుగొనడంతో మొత్తం బాగోతం బట్టబయలైంది.

వీరు చేసిన ఈ యవ్వారంపై పోలీసులు - కరెంట్ శాఖ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వీరిపై విద్యుత్ చట్టంలోని 135 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ అయ్యింది. కాగా తెలుగులో పలు సినిమాల్లో నటించిన రతి.. డిక్టేటర్ - అందాల రాశి - పున్నమినాగు - మాయదారి కృష్ణుడు - వయ్యారి భామలు-వగలమారి భర్తలు సినిమాలతో మంచి పేరు సంపాదించుకుంది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/