Begin typing your search above and press return to search.

బోన్ లెస్ చికెన్ వింగ్స్ కాదు.. ఎలుక మాంసం!

By:  Tupaki Desk   |   3 Aug 2017 4:37 AM GMT
బోన్ లెస్ చికెన్ వింగ్స్ కాదు.. ఎలుక మాంసం!
X
మిగిలిన దేశాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. చైనీయులు.. ఆ దేశానికి కాస్త అటూ ఇటూగా ఉండే దేశాల్లోని వారి ఆహార అల‌వాట్లు ఒక ప‌ట్టాన మింగుడ‌ప‌డ‌వు. క‌ప్ప మొద‌లు ఎలుక‌.. పాము.. ఇలా చెప్పుకుంటూ పోతే వారు.. ఎలాంటి జంతువైనా ఇట్టే లాగించే గుణం క‌నిపిస్తుంటుంది. మ‌న‌కా మాట‌లు వింటేనే.. వాంతి వ‌చ్చే ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా యూఎస్ లో ఒక భారీ కంటైన‌ర్‌ ను త‌నిఖీ చేసిన సంద‌ర్భంగా షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

అగ్ర‌రాజ్యంలో బోన్ లెస్ చికెన్ వింగ్స్ పేరుతో ప‌లు రెస్టారెంట్లు వండి వార్చే వంట‌కం ఎంత‌మాత్రం చికెన్ కానే కాదంటున్నారు. అది చైనా ఎలుక‌ల మాంసంగా తేల్చారు.

కంటెయిన‌ర్ల కొద్దీ ఎలుక మాంసాన్ని అగ్ర‌రాజ్యానికి ఎగుమ‌తి చేస్తున్న వైనాన్ని గుర్తించిన అమెరికా అధికారుల నోట మాట రాని ప‌రిస్థితి. భారీ ఎత్తున చైనా ఎలుక‌ల మాంసాన్ని ఎగుమ‌తి చేస్తుంటే.. అమెరికా కంపెనీలు వాటిని ప్రాసెస్ చేసి.. బోన్ లెస్ చికెన్ వింగ్స్ పేరుతో రెస్టారెంట్ల‌కు విక్ర‌యిస్తున్నాయ‌ట‌.

వాటిని అదే పేరుతో రెస్టారెంట్లు సైతం వండి వ‌డ్డిస్తున్న‌ట్లుగా తేల్చారు. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో పోర్టులోకి వ‌చ్చిన ఒక కంటెయిన్ ను అమెరికా ఫుడ్ అండ్ డ్ర‌గ్ ఆడ్మినిస్ట్రేటివ్ ప‌రిశీలించ‌గా తాజా షాకింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏటా దాదాపు నాలుగున్న‌ర ల‌క్ష‌ల కేజీల ఎలుక మాంసాన్ని అమెరికాలో అమ్ముతున్న‌ట్లుగా లెక్క తేల్చారు. సో.. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ బోన్ లెస్ చికెన్ వింగ్స్ అంటూ అమ్మే వంట‌కాల్ని తొంద‌ర‌ప‌డి తినొద్ద‌ని అధికారులు అమెరికా ప్ర‌జ‌ల్ని కోరుతున్నారు. అమెరికాలో ఉన్న మ‌నోళ్లు.. ఈ విష‌యం మీద కాస్త అలెర్ట్ గా ఉంటే మంచిది.