Begin typing your search above and press return to search.

సిగ్గుప‌డేలా అత్యాచారం..కోర్టులోనే లాయ‌ర్ల ప్ర‌తాపం

By:  Tupaki Desk   |   17 July 2018 5:38 PM GMT
సిగ్గుప‌డేలా అత్యాచారం..కోర్టులోనే లాయ‌ర్ల ప్ర‌తాపం
X
స‌భ్య‌స‌మాజం సిగ్గుప‌డేలా...త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో అత్యాచార ఘ‌ట‌న చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయనావరంలోని సన్నీవేల్ అపార్ట్‌ మెంట్‌ లో మైనర్ బాలికపై 24 మంది అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేయ‌గా...మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. కాగా, ఈ ఘ‌ట‌న‌లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. నిందితులపై మద్రాస్ హైకోర్టు లాయర్లు దాడి చేశారు. తమ తరఫున వాదించాలని కోరిన నిందితులను కోర్టు పై అంతస్థు నుంచి కొట్టుకుంటూ కిందకు తీసుకువచ్చి తీవ్రంగా గాయపరిచారు.

వివ‌రాల్లోకి వెళితే...చెన్నై సిటీలోని పురసవల్కం ఏరియాలో ఉండే గేటెడ్ కమ్యూనిటీలోని ఓ అపార్ట్‌ మెంట్లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కావ‌డంతో అపార్ట్‌ మెంట్ అయితేనే నలుగురు మనుషులు తిరుగుతూ ఉంటారు.. నాలుగు ఇళ్లల్లోని వారు పరిచయం ఉంటారు అనుకున్న ఆ కుటుంబంలో గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటుంది.. కానీ ఇక్కడ కూడా వారి కుమార్తెకు.. ఆ చిన్నారికి భద్రత లేదని తేలిపోయింది. 12 ఏళ్ల చిన్నారిపై..7 నెలలుగా అత్యాచారం చేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 18 మంది కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అపార్ట్‌మెంట్ లో పని చేసే సెక్యూరిటీ గార్డులు - లిఫ్ట్ సెక్యూరిటీ గార్డ్ - ఫ్లంబర్ - కార్పెంటర్.. ఇలా రోజువారీ విధులు నిర్వహించే మగాళ్లు అందరూ కూడా ఆ చిన్నారిపై అత్యాచారం చేశారు. ఇంట్లో పేరంట్స్ కు చెబితే చంపేస్తామని బెదిరించారు. చిన్నారిని కాదు.. ఇంట్లో ఉండే మమ్మీ - డాడీ - అక్కను చంపేస్తామని పలుమార్లు బెదిరించారు. దీంతో ఆ చిన్నారి నోరు విప్పటానికి కూడా భయపడింది. అనారోగ్యం - బాలికలో విపరీతమైన భయం - మార్పులను గమనించిన త‌ల్లిదండ్రులు పదే పదే ప్రశ్నించటం - కౌన్సెలింగ్ ఇవ్వటం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కూతురు చెప్పే మాటలకు ఆ తల్లి గుండె పగిలింది. భద్రత ఇవ్వాల్సిన వారే.. ఈ విధంగా చేయటంపై కన్నీరు మున్నీరు అయ్యింది. ఈ ఘటన బయటకు తెలిస్తే కూతురు జీవితం ఏమౌతుందో అని ఆ తల్లి భయపడింది.. కానీ ఇంత కిరాతంగా వ్యవహరించిన వారికి కచ్చితంగా శిక్ష పడాలి అని భావించి పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు బంధువులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ గేటెడ్ కమ్యూనిటీలోని మిగతా కుటుంబాలు కూడా షాక్ అయ్యాయి. మొత్తం సిబ్బందిని నిర్బంధించారు. పోలీసులకు అప్పగించారు. ఈ కేసుపై సీరియస్ గా ఉన్న పోలీసులు.. 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది పాత్ర కూడా ఉందని నిర్థారణకు వచ్చారు. వారి కోసం గాలిస్తున్నారు.

దేశం మొత్తం ఈ ఘటనతో షాక్ అవ్వగా ఈ దారుణ‌మైన ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన మాన‌వ మృగాలు ఈరోజు హైకోర్టుకు వ‌చ్చాయి. బెయిల్ కోసం ఉదయం మద్రాస్ హైకోర్టుకు చేరుకొని తమ తరఫున వాదించాలని లాయర్లను కోరేందుకు వెళ్లారు. అయితే చిన్నారిపై పాల్ప‌డ్డ దారుణాన్ని గుర్తుచేసుకొని ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన న్యాయవాదులు.. మూకుమ్మడిగా నిందితులపై దాడికి దిగారు. పై అంతస్థు నుంచి కొట్టుకుంటూ కిందకు వస్తుండ‌గా పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయిన‌ప్ప‌టికీ వారిని వదిలి పెట్టలేదు. చివరకు ఎలాగోలా నిందితులను కాపాడగలిగారు పోలీసులు. వారిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. కాగా, ఈ ప‌రిణామంతో సిటీలో అపార్ట్ మెంట్లు - గేడెట్ కమ్యూనిటీలో నివాసం ఉంటే వారి గుండెలు అదిరాయి.