Begin typing your search above and press return to search.

హ‌త్య కేసులో బాబా రాంపాల్ కు యావ‌జ్జీవం!

By:  Tupaki Desk   |   16 Oct 2018 1:25 PM GMT
హ‌త్య కేసులో బాబా రాంపాల్ కు యావ‌జ్జీవం!
X
హిసార్ లోని సెషన్స్‌ కోర్టు మంగళవారం నాడు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. 2 హత్య కేసుల్లో దోషిగా తేలిన బాబా రాంపాల్ కు హిసార్ లోని సెషన్స్‌ కోర్టు మంగళవారం నాడు జీవిత ఖైదు విధిస్తూ చ‌రిత్రాత్మ‌క తీర్పునిచ్చింది. రాంపాల్ తో పాటు ఆయ‌న అనుచ‌రులు 27 మందికీ ఇదే శిక్ష విధించింది. నాలుగేళ్ల సుదీర్ఘ విచార‌ణ‌ అనంతరం హిసార్‌ అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి డీఆర్‌ చాలియా తుది తీర్పు వెల్లడించారు. మరో మహిళ హత్య కేసులో వారికి ఏ శిక్ష ప‌డ‌నుందో బుధవారం వెల్ల‌డికానుంది. బాబా రాంపాల్ కు శిక్ష ఖరారైన‌ నేపథ్యంలో కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రేప‌టి వ‌ర‌కు ఆ బందోబ‌స్తును కొనసాగించ‌బోతున్నారు. గ‌తంలో డేరా బాబాకు శిక్ష విధించే స‌మయంలో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకొని గ‌ట్టి భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

హర్యానాకు చెందిన రాంపాల్ ....గ‌తంలో జలవనరుల శాఖలో ఇంజనీరుగా పని చేశాడు. 1996లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ....దైవ దూతగా ప్రకటించుకున్నాడు. `కబీర్ పంత్`గా చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో పేరుగాంచిన‌ రాంపాల్...`జగద్గురు రాంపాల్ జీ` పాపుల‌ర్ అయ్యారు.

నలుగురు మహిళలతో పాటు ఓ చిన్నారిని నిర్భంధించి హత్య చేసిన‌ట్టు రాంపాల్, ఆయ‌న అనుచ‌రుల‌పై 2014లో ఆరోపణలు వ‌చ్చాయి. తమ భార్యలను రాంపాల్, ఆయ‌న అనుచ‌రులు హత్య చేశార‌ని వారి భర్తలు ఫిర్యాదు చేశారు. దీంతో, విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు ....సాత్లోక్ ఆశ్రమంలో మందుగుండు సామాగ్రి, పెట్రోల్ బాంబులు, యాసిడ్ సిరంజీలు, గర్భ పరీక్ష స్ట్రిప్ లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆయుధాలను కలిగి ఉండడం.. హత్యలు, హత్యా ప్రయత్నాలు చేసినందుకు రాంపాల్‌ను 2014 నవంబర్‌ 19న పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా, రెండు మర్డర్ కేసుల్లో వారు నిందితులుగా తేల‌డంతో రాంపాల్ , ఆయ‌న 27మంది అనుచ‌రుల‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఆ సమయంలో మ‌రో, మహిళ కూడా ఆశ్రమంలో చనిపోయినట్టు నిర్ధారణ అయింది. ఆ కేసు తీర్పును రేపు కోర్టు వెల్ల‌డించ‌నుంది.