Begin typing your search above and press return to search.

టీడీపీ ఏపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఈయనేనా..!?

By:  Tupaki Desk   |   20 Jun 2019 5:44 AM GMT
టీడీపీ ఏపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఈయనేనా..!?
X
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది.. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత ఇప్పుడు టీడీపీ నుంచి జారుకునేందుకు కొందరు రెడీ అవుతున్నారని సమాచారం.. రహస్య చర్చలు జరుపుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నారు.. అందుకే అనాదిగా టీడీపీని నమ్ముకొని బాబు వెన్నంటి ఉండే కింజారపు ఫ్యామిలీకే మరో పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడిని నియమించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే రామ్మోహన్ నాయుడికి లోక్ సభ పక్ష ఉపనాయకుడిగా బాబు నియమించారు. ఇప్పుడు ఏకంగా ఏపీ రాష్ట్ర శాఖ బాధ్యతలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది..

ఇక అసెంబ్లీలో కూడా చంద్రబాబు టీడీపీ పక్ష నేతగా ఉంటే.. రామ్మోహన్ నాయుడు బాబాయ్ అయిన అచ్చెన్నాయుడు టీడీపీ పక్ష ఉపనాయకుడిగా ఉన్నారు. ఇలా అదే కుటుంబానికి చంద్రబాబు మరో పదవి ఇస్తారా అన్న చర్చ సాగుతోంది.

ఇప్పటివరకు ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా కళావెంకట్రావ్ ఉండేవారు. ఆయన ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలిసింది.

అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రావ్ ను డమ్మీ చేసి నారా లోకేష్ అంతా టీడీపీలో చక్రం తిప్పారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ఇప్పుడు లోకేష్ కూడా ఓడిపోయాడు. అంతేకాకుండా ఆయన నాయకత్వ లక్షణాలపై అనుమానులున్నాయి. అందుకే మంచి మాటకారి - వక్త.. పైగా బీసీ కావడం.. నాయకత్వ లక్షణాలు ఉన్న రామ్మోహన్ నాయుడిని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్న సమాచారం.