Begin typing your search above and press return to search.

పాక్‌ లో రాందేవ్ బాబా యోగా!

By:  Tupaki Desk   |   19 Jun 2017 11:05 AM GMT
పాక్‌ లో రాందేవ్ బాబా యోగా!
X
పాకిస్థాన్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ఖ్యాత యోగా గురువు రాందేవ్ బాబా యోగా పాఠాలు నేర్ప‌నున్నారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దాయాది దేశం పాక్‌ నుంచి ఆయ‌న‌కు పిలుపు వ‌చ్చింది. పాకిస్థాన్‌ లో యోగాకార్యక్రమం నిర్వహించాల్సిందిగా త‌న‌కు ఆహ్వానం అందింద‌ని రాందేవ్ బాబా చెప్పారు. పాకిస్థాన్‌ వెళ్లి అక్కడి వారితో యోగాస‌నాలు వేయిస్తానంటున్నారు రాందేవ్‌బాబా.

ఈ సంద‌ర్భంగా రాందేవ్ బాబా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పాక్‌లోని ప్రతీ ఒక్కరూ ఉగ్రవాదులు కారని, వారు కూడా యోగా నేర్చుకోవడానికి ఆస‌క్తి చూపుతున్నార‌ని అన్నారు. అయితే, పాకిస్థాన్‌ లో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణమే త‌న‌ను కలచివేస్తోందని రాందేవ్ చెప్పారు. ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులున్న‌ప్ప‌టికీ తాను పాక్‌ కి వెళ్లాలనుకుంటున్నాన‌ని రాందేవ్ బాబా అన్నారు.

వివాదాస్ప‌ద క‌శ్మీర్ అంశంపై రాందేవ్ బాబా త‌న‌దైన శైలిలో స్పందించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ను భారత్‌ లో కలపాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విష‌యం గురించి ఆలోచించడానికి భారత ప్రభుత్వానికి ఇదే సరైన సమయ‌మ‌న్నారు. ఆ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం క‌నుగొనాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు.

1993 ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులైన దావూద్‌ ఇబ్రహీం - జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ - జమాత్‌ అధినేత హఫీజ్‌ సయీద్‌ లను మట్టుబెట్టాలని రాందేవ్ అన్నారు. పాక్‌ లోని ప్ర‌జ‌లంతా చెడ్డవారు కాదని, కొంద‌రు త‌మ స్వార్థం కోసం ఉగ్రవాదాన్ని ప్రోత్స‌హిస్తున్నార‌ని రాందేవ్‌ బాబా తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/