Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ పై వ‌ర్మ ట్వీట్ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్

By:  Tupaki Desk   |   21 Feb 2019 5:07 AM GMT
ఇమ్రాన్ పై వ‌ర్మ ట్వీట్ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్
X
వంద‌లాది కేజీల ఆర్డీఎక్స్ లోడుతో ఉన్న వాహ‌నంతో ఆర్మీ వాహానాన్ని ఢీ కొని 40 మంది జ‌వాన్ల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన పుల్వామా ఆరాచ‌కం ప్ర‌తి భార‌తీయుడి మ‌న‌సును క‌లిచివేసింది. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో ఒక ఉదంతంలో ఇంత భారీ ఎత్తున ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌టం ఎప్పుడూ లేదు. దీనిపై ఇప్ప‌టికే భార‌త స‌ర్కారు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మ‌రోవైపు దేశ వ్యాప్తంగా పాక్ తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. దాయాది దేశంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. త‌గిన రీతిలో బుద్ధి చెప్పాల‌న్న డిమాండ్ భార‌తీయుల నుంచి పెద్ద ఎత్తున వ‌స్తోంది.

మ‌రోవైపు.. భార‌త్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తివిమ‌ర్శ‌లు చేస్తూ.. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై భార‌త్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తోంది. ఎప్ప‌టిమాదిరి పుల్వామాలో త‌మ పాత్ర ఏమీ లేద‌ని.. ఉంటే.. ఆధారాలు చూపించాల‌నటాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఇదిలా ఉంటే.. నిత్యం త‌న వ్యాఖ్య‌ల‌తో వివాదాల్లో మునిగితేలే సినీ ప్ర‌ముఖుడు రాంగోపాల్ వ‌ర్మ తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ పై ట్వీట్ల వ‌ర్షం కురిపించారు. ఇమ్రాన్ ను ఉద్దేశించి వ‌ర్మ చేసిన వ‌రుస ట్వీట్లు.. పాక్ ప్ర‌ధానిపై ఆర్జీవీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ గా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు. త‌న విమ‌ర్శ‌ల ట్వీట్ల‌లో ఇమ్రాన్ వ్య‌క్తిగ‌త అంశాల్ని వ‌ర్మ ప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం. సూటిగా ఇమ్రాన్ ను ఉద్దేశించి వ‌ర్మ చేసిన విమ‌ర్శ‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. వ‌ర్మ ట్వీట్ల‌ను తెలుగులో య‌థాత‌ధంగా చెబితే..

+ ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌.. స‌మస్యలు ఒక్కమాటతో పరిష్కారమైతే.. మీకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు.

+ ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఒక వ్యక్తి టన్నుల కొద్ది ఆర్‌ డీఎక్స్‌ తో తమ వైపు పరిగెత్తుకొస్తున్నప్పుడు అతనితో ఎలా చర్చలు జరపాలో మా మొద్దు భారతీయులకు నేర్పించండి.. కావాలంటే మీకు ట్యూషన్ ఫీజు కూడా ఇస్తాము.

+ ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఒసామాలాంటి వ్యక్తి మీ దేశంలో ఉన్నాడని ఆమెరికాకు తెలుస్తుంది.. కానీ మీకు తెలియదు. మరి మీది అసలు దేశమేనా? చెప్పండి సార్ ఓ మొద్దు భారతీయుడు అడుగుతున్నాడు. మాకు కొంచం తెలివితేటలు నేర్పిపించండి.

+ ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. జేష్-ఏ-మహ్మద్, లష్కర్-ఏ-తొయిబా, తాలిబన్, అల్-ఖయిదా మీ ప్లే స్టేషన్లు అని నాకెవ‌రూ చెప్పలేదు. కానీ మీరు కూడా వాటిపై మీకు ప్రేమ లేదన్న విషయాన్ని అంగీకరించలేదు.

+ ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. జేష్-ఏ-మహ్మద్, లష్కర్-ఏ-తొయిబా, తాలిబన్, అల్-ఖయిదాలను మీరు బాల్స్ గా భావించి.. పాకిస్థాన్ బౌండరీలు దాటిస్తూ.. ఇండియా పెవిలియన్‌లోకి పంపుతున్నారు. కానీ మీరు వాటిని క్రికెట్ బాల్స్ అనుకుంటున్నారా.. లేదా బాంబ్స్ అనుకుంటున్నారా.. కాస్త చెప్పండి సార్?