Begin typing your search above and press return to search.

హవ్వ..బూతుసైట్లు బ్యాన్ చేయటమేమిటి?

By:  Tupaki Desk   |   3 Aug 2015 3:55 AM GMT
హవ్వ..బూతుసైట్లు బ్యాన్ చేయటమేమిటి?
X
మనసులోని మాటను ఓపెన్ గా చెప్పేస్తుంటారు ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ. విషయం ఏదైనా దాన్ని తనకు అనిపించింది అనిపించినట్లుగా చెప్పేస్తుంటారు. అది కేసీఆర్ అయినా.. చంద్రబాబు అయినా ఆయనకు పెద్ద వ్యత్యాసం ఉండదు.

తాజాగా.. బూతు సైట్లపై కేంద్రం ఉక్కుపాదం మోపటం.. చాలావరకు సైట్ల ను బ్లాక్చేయటం తెలిసేందే. దీనిపై రాంగోపాల్ వర్మ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది సరైన చర్య కాదంటూ ట్వీట్ చేశారు.

అశ్లీల సైట్లను నిషేధించటం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. దీనినైనా నిషేధించటం ద్వారా నియంత్రించాలని చూసతూ.. అది తెర వెనుక మరింత బలం పుంజుకుంటుందని.. ఇది చరిత్రలో చాలాసార్లు నిరూపితమైన సత్యమని.. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం ఏ రూపంలో అయినా హరిస్తే.. అది దేశ సామాజిక పురోగతిని తిరోగమించేలా చేస్తుందని వ్యాఖ్యానించారు.

అశ్లీల చిత్రాలు లైంగిక నేరాలను పెంచవని.. పైగా లైంగిక నిగ్రహానికి అదో సురక్షితమైన మార్గమని పేర్కొన్నారు. తాను చెప్పిన ఈ విషయం ఇప్పటికే పలు అంతర్జాతీయ సర్వేల్లో నిరూపితమైందని తన ట్వీట్స్ తో వ్యాఖ్యానించారు. బూతు సైట్లపై నిషేదం విధించే కన్నా.. వాటి కంటెంట్ తప్పుడు మార్గంలో వెళ్లకుండా ప్రభుత్వం చూస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి బూతు సైట్లు కనిపించకుండా చేయాలన్న కేంద్రం ఆలోచనను ఓపెన్ గానే వ్యతిరేకించిన రాంగోపాల్ వర్మ తన ఓపెన్ నెస్ ని మరోసారి చాటారు.