గుర్మిత్ లేకున్నా ఆశ్రమంలో విషకన్యలు

Wed Sep 13 2017 13:21:14 GMT+0530 (IST)

కథల్లో కనిపించే విషకన్యలు వివాదాస్పద డేరా బాబా ఆశ్రమంలోనూ ఉన్న కొత్త విషయం బయటకు వచ్చింది. సాధ్వీలను అత్యాచారం చేసిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న డేరాబాబాకు సంబంధించిన కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. గుర్మీత్ సెక్స్ బానిస అని.. పలువురు మహిళలని బలవంతంగా వారితో శృంగారానికి పాల్పడినట్లుగా ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. డేరాబాబాకు సేవలు చేసే సాధ్వీలలో చాలామందితో బాబా అత్యాచారానికి పాల్పడినట్లుగా చెబుతారు. ఇదిలా ఉంటే.. తాజాగా అందమైన అమ్మాయిల్ని గుర్మిత్ దగ్గర పంపటానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉందని చెబుతున్నారు.డేరా ఆశ్రమంలో విషకన్యల్ని గుర్మిత్ ఏర్పాటు చేసిన విషయం బయటకు వచ్చింది. వీరిలో ఎక్కువమంది గతంలో సాధ్వీలుగా పని చేసిన వారేనని చెబుతున్నారు. అందమైన యువతుల్ని తమ బుట్టలో వేసుకొని బాబా మందిరానికి తీసుకెళతారని చెబుతున్నారు.

అమాయక మహిళలకు మాయమాటలు చెప్పే విషకన్యలు గుర్మిత్ అంతరంగిక మందిరానికి తీసుకెళతారని.. వారిని ఒప్పిస్తారని.. బాబా ఆశీర్వాదంతో పవిత్రులవుతారంటూ మాయమాటలతో లొంగదీసుకుంటారని తెలుస్తోంది. ఎవరైనా తాము చెప్పిన దానికి అంగీకరించకుండా వ్యతిరేకిస్తే మాత్రం వారిని కట్టేసి రోజుల తరబడి ఉంచుతారని చెబుతున్నారు. ముఖానికి నల్లరంగు పూయటంతో పాటు.. గాడిదల మీద కట్టేస్తారని.. ఆహారం అస్సలు ఇవ్వరని తెలుస్తోంది. ఇప్పటికి ఈ తరహా విష కన్యలు ఇంకా డేరా ఆశ్రమంలోనే ఉన్నట్లుగా చెబుతున్నారు.   మరి.. వీరి విషయంలో పోలీసులు ఏం చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.