Begin typing your search above and press return to search.

ఆ కేసులో ఒక లాయర్ ఫీజే రూ.52లక్షలు

By:  Tupaki Desk   |   3 Sep 2015 4:30 AM GMT
ఆ కేసులో ఒక లాయర్ ఫీజే రూ.52లక్షలు
X
రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన నాటి నుంచి కోర్టు కేసులు భారీగా పెరిగిపోవటం తెలిసిందే. బోలెడన్ని వివాదాలు రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన విషయం తెలిసిందే. ఇది కాక.. రాజకీయంగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విబేధాలతో మరికొన్ని కేసులు తెరపైకి వస్తున్నాయి.

ఓటుకు నోటు కేసుకు ప్రతిగా టెలిఫోన్ ట్యాపింగ్ ఉదంతం తెరపైకి రావటం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ సర్కారు తరఫున వాదనలు వినిపించటానికి ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలానీ సీన్లోకి రావటం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తెలంగాణ సర్కారు అనుసరించిన వైఖరి గురించి రాంజెఠ్మాలానీ తన వాదనను వినిపించారు.

ఇందుకుగాను.. ఆయనకు తెలంగాణ రాష్ట్ర సర్కారు రూ.52లక్షల ఫీజును చెల్లించింది. మిగిలిన కేసుల విషయంలో ఏ మేరకు ఖర్చులు అవుతున్నాయో బయటకు రావటం లేదు. కానీ.. రాం జెఠ్మాలానీకి ఇచ్చిన ఫీజు మొత్తం గురించి మాత్రం తాజాగా బయటకు వచ్చింది. తెలంగాణ నిఘా విభాగానికి ప్రభుత్వం ఈ మొత్తం కేటాయించగా..ఆయనకు ఇచ్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మరి.. ఈ భారీ మొత్తం ఈ కేసుకు సంబంధించి రాంజెఠ్మాలానీకి పార్ట్ అమౌంటా? ఫుల్ అమౌంటా అన్నది తేలాల్సి ఉంది.