సోమిరెడ్డిని గట్టిగా తగులుకున్న వర్మ

Thu Oct 12 2017 14:16:33 GMT+0530 (IST)

రామ్ గోపాల్ వర్మ సినిమా అంటేనే వివాదం. ఐతే ఇప్పటిదాకా వర్మ తన సినిమాలతో రేపిన వివాదాలు ఒకెత్తు. ఇప్పుడు ఎన్టీఆర్ జీవిత కథతో తీస్తానంటున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ద్వారా రాజేస్తున్న వివాదం మరో ఎత్తు. వర్మ.. ఎన్టీఆర్ మీద సినిమా తీస్తాననగానే అగ్గిరాజుకుంది. ఇక లక్ష్మీపార్వతి కోణంలో సినిమా తీయబోతున్నట్లు చెప్పాక వివాదం మరింత ముదిరింది. ఈ కోణంలో సినిమా అంటే తెలుగుదేశం పార్టీ అధినేత - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడికి ఇబ్బందులు తప్పవు కాబట్టి ఆ పార్టీ నేతలు లైన్లోకి వచ్చేశారు. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్మను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు. ఐతే వర్మ ఇలాంటి వాటిపై తగ్గే రకం కాదు కదా. వెంటనే ఫేస్ బుక్ ద్వారా సోమిరెడ్డిని గట్టిగా తగులుకున్నాడు. తన ఫేస్ బుక్ పోస్టులో వివరగా సోమిరెడ్డి ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు వర్మ. అక్కడ వర్మ ఏమన్నాడో యథాతథంగా..My replies to the great honourable TDP agriculture minister మర్యాద తిమ్మన్న సోమిరెడ్డి గారి comments

మినిస్టర్ సోమి : NTR జీవిత చరిత్ర సినిమాలో నన్ను హీరో గా చేయమని రాంగోపాల్ వర్మ అడగడం సంతోషం. నేను హీరోగా చేయాలంటే హీరోయిన్ గా లక్ష్మీ పార్వతిని మార్చాలి

RGV: సార్ మీరు హీరోయిన్ గా లక్ష్మి పార్వతి గారిని వద్దు అని చెప్పినప్పట్నుంచి దీపికా పడుకొనే నుండి మీ అగ్రికల్చర్ పొలాలలో పని చేసే స్త్రీ కూలీల దాకా అందర్నీ అడిగి చూసా. వాళ్ళ రిప్లైలు వింటే మీరు ఉరేసుకుంటారు. కాబట్టి మానవతా దృక్పధం కన్నా మీ భార్య గారి మీద గౌరవంతో వాళ్ళు మీ పైన వ్యక్తపరిచిన అభిప్రాయాలు అన్నింటిని నా మనసులోనే అతి భద్రంగా దాచిపెడ్తున్నా

మినిస్టర్ సోమి: లక్ష్మి పార్వతి గారంటే నాకు చాలా గౌరవం ఉంది . అందుకే ఆమె హీరోయిన్ గా వద్దు అంటున్నా..

RGV: అంటే హీరోయిన్లు గౌరవానికి అనర్హులనా? మినిస్టర్ గారూ - హీరోయిన్లపై మీ ఈ insulting కామెంట్ పైన దీపికా పదుకొనె - సమంత - కత్రినా కైఫ్ - ఇలియానా - ప్రియాంక చోప్రా వగైరా హీరోయిన్ల రియాక్షన్లు మీడియా వెంటనే తీసుకోకపోతే వాళ్ళు కూడా మీ అంత అతి వాళ్ళు ..నేను దీని అర్థం చెప్పను. ఎందుకులే ఎంత చెడ్డా మీరు మినిస్టర్ గా!!!

మినిస్టర్ సోమి: ఎన్ టి ఆర్ గురించి నాకు తెలిసినంతగా రాంగోపాల్ వర్మకు తెలియదు

RGV: మై డియర్ సోమి  - ఇక్కడ ప్రశ్న నాకెంత తెలుసని కాదు. తెలిసేంత బుర్ర నీకు ఉందా అని ?

మినిస్టర్ సోమి: రాజకీయ ఉద్దేశాలతోనే ఈ సినిమాను ఎన్నికల ముందు తీస్తున్నారు

RGV: సోమి - రాజకీయ ఉద్దేశాలు ఏమి లేకుండానే రాజకీయ నాయకుడివి అయ్యావా .....ఆలా అయితే nee N కి నా నమస్కారం. N ని తప్పుగా అర్థం చేసుకోవద్దు ..N అంటే nee నోరు

మినిస్టర్ సోమి: political reasons కోసమే ఈ సినిమాకు వైసీపీ నేత నిర్మాతగా వున్నారు

RGV: ఛా! మా నాయనే... నీ ఇల్లు బంగారం గాను... చిన్నప్పటి నుండి ఇన్ని తెలివితేటలా సార్... వావ్

మినిస్టర్ సోమి: ఎన్ టి ఆర్ చరిత్రను వక్రీకరించి కేవలం లక్ష్మీ పార్వతి కోణంలోనే సినిమా తీస్తే ప్రజలు ఒప్పుకోరు..

RGV: ఓహ్ సార్ ఈ మాట కోట్ల ప్రజలు ట్రైన్లలో - బస్సుల్లో మీ ఇంటికొచ్చి మీ చెవిలో చెప్పారా సార్ ..Soooo wonderfulll Want to sooooo kiss u

మినిస్టర్ సోమి: రామ్ గోపాల్ వర్మ తీసే సినిమా గురించి మేము భయపడటం లేదు

RGV: భయపడనప్పుడు ఇంత అరవాల్సిన అవసరం ఏముంది రెడ్డి గారు ? Just asking? గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం ఉందంటారా సార్ ?

మినిస్టర్ సోమి: రాజకీయ ప్రయోజనాలు లేకుండా వాస్తవమ్ తీయమని అంటున్నా...

RGV: అబ్బబ్బో మీకు నాకన్నా ఎక్కువ వాస్తవాలు తెలుసని మీరు అంటుంటే ఆ రోజుల్లో తలుపెనక నక్కి ఉండేవారా లేక మంచం కింద దాక్కునేవారా? ...రెడ్డిగారు చెప్పండి ప్లీజ్ ..మేము మీ గాసిప్ కోసం తహతహలాడిపోతున్నాము.

చివరగా నాకన్నా ఎక్కువ NTR గారి గురించి తెలుసన్న సోమిరెడ్డి గారికి నా open challenge ఏమిటంటే TV9 లో Open Debate కి రమ్మని ..సోమిరెడ్డి గారు మీరు ఫ్రీ ఉన్నపుడు ముంబైలో నా అన్ని పనులు మానుకొని debate కి వస్తా ..టైము ప్లేసు మీరే చెప్పండి సార్

మినిస్టర్ సోమిరెడ్డి: NTR పై వర్మ తో బహిరంగ చర్చకు నేనే కాదు నా పాలేరు కూడా వెళ్ళడు

RGV: మీరు మీ పాలేరు కూడా చర్చకి రాలేనప్పుడు అసలు నా మాటల మీద స్పందించవలిసిన అవసరమేమొచ్చింది సార్.. మీరు రావట్లేదంటే మీ కన్నా  NTR గారి గురించి నాకే ఎక్కువ తెలుసని మీరొప్పుకున్నట్టేగా.. థాంక్స్ సార్

మినిస్టర్ సోమిరెడ్డి: వర్మ తెలివితేటలు ఏదైనా ఉంటే లక్ష్మీస్ ఎన్ఠీఆర్ సినిమా సక్సెస్ పై చూపమను

RGV : వావ్.. ఏం జీనియస్ సార్ మీరు....  మీరు చెప్పేవరకు నాకు ఈ విషయం తట్టనే లేదు. సోమి టీచర్ గారుకని విని ఎరుగని గొప్ప పాఠం చెప్పారు..దయచేసి ఫీజు ఏ అడ్రెస్స్ కి పంపాలో చెప్పండి ?