Begin typing your search above and press return to search.

రాంగోపాల్‌ వర్మ ‘జీఎస్టీ’ బీజేపీకి నచ్చిందట..

By:  Tupaki Desk   |   20 March 2018 4:08 AM GMT
రాంగోపాల్‌ వర్మ ‘జీఎస్టీ’ బీజేపీకి నచ్చిందట..
X
మొన్నటివరకు టీడీపీలో ఉండి రీసెంటుగానే బీజేపీలో చేరిన నటి కవిత ఇండైరెక్టుగా ఒక మ్యాటర్ లీక్ చేశారు. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ త్వరలో బీజేపీలో చేరుతారన్నదే ఆ ముచ్చట. రాంగోపాల్ వర్మకు - బీజేపీకి అస్సలు మ్యాచ్ కాదని అనుకునేవాళ్లున్నా కూడా కవిత మాటలు విని సరే చూద్దాం ఏం జరగబోతోందో అంటున్నారు. ‘‘వర్మకు మోడీ అంటే చాలా ఇష్టం - ఆయన బీజేపీలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. కొద్దిరోజులు వేచిచూస్తే అన్నీ తెలుస్తాయి’’ అని కవిత అన్నారు.

అయితే.. బీజేపీయే వర్మ కోసం ప్రయత్నిస్తోందని... ఇప్పటికే ఆయనతో బీజేపీ దూతలు చర్చలు జరిపారని - అందులో కవిత కూడా ఉన్నారని టాక్. అయితే... నోరు విప్పితే చాలు ఎవరినో ఒకరిని తిట్టిపోసే వర్మను పార్టీలోకి తీసుకుంటే ఒళ్లో నిప్పులు పోసుకున్నట్లేనని అంటున్నారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే పలువురు బీజేపీ నేతలకు వర్మ కూడా తోడవుతారనీ అంటున్నారు.

అయితే.. ఈ సంగతి తెలిసిన నెటిజన్లు మరో కొత్త లాజిక్ చెప్తున్నారు. దేశమంతా తమ జీఎస్టీని వ్యతిరేకిస్తే వర్మ మాత్రం జీఎస్టీ కోసం జనాలు ఎగబడేలా చేయగలిగారని... అంతేకాదు.. తాము జీఎస్టీ రిలీజ్ చేస్తే తిట్టిన జనాలు వర్మ జీఎస్టీ కోసం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూశారని... డబ్బు పెట్టి మరీ జీఎస్టీ చూశారని... జీఎస్టీని జనానికి అంత ఇష్టమయ్యేలా చేసినందుకే బీజేపీ వర్మపై మోజు పడుతోందన్న సెటైర్లు పడుతున్నాయి.