Begin typing your search above and press return to search.

కేసీఆర్ అందం చూసి ఇవాంకా షాక్ అవుతుంది

By:  Tupaki Desk   |   23 Nov 2017 6:44 PM GMT
కేసీఆర్ అందం చూసి ఇవాంకా షాక్ అవుతుంది
X
ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ గురించి ప‌రిచ‌యం అవ‌సరం లేదు..ఆయ‌న చేసే కామెంట్ల గురించి...వాటి వ‌ల్ల క‌లిగే వివాదాల గురించి కూడా కొత్త తెలియ‌జెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌న ట్వీట్లు, కామెంట్ల‌తో వివాదాలు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ..వ‌ర్మ త‌న స్టైల్‌ను ఏ మాత్రం మార్చుకోర‌నే సంగ‌తి తెలిసిందే. ఇలా అనేక అంశాల‌పై త‌న‌దైన శైలిలో స్పందించే వర్మ తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య ఇవాంకాను కూడా వ‌ద‌ల‌లేదు. ఏకంగా ఆమె అందాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు లింక్ పెట్టేసి వ‌రుస ట్వీట్ల‌తో క‌ల‌క‌లం సృష్టించారు.

త‌ను అందంగా ఉంటుంద‌నే అహంభావం ఇవాంకాకు ఎక్కువ అని వ‌ర్మ పేర్కొన్నారు. అలాంటి ఇవాంకాకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అందాన్ని చూస్తే షాక‌వ్వ‌డం ఖాయం అని వ‌ర్మ ఎద్దేవా చేశారు. `నేను చాలెంజ్ చేస్తున్నాను. కేసీఆర్‌, ఇవాంకా ప‌క్క‌ప‌క్క‌న ఉంటే...ఇవాంకాను ఎవ‌రూ చూడ‌రు` అంటూ త‌న మార్కు విశ్లేష‌ణ చేశారు. ఇక్క‌డితోనే ఆపేయ‌ని వ‌ర్మ‌...ఇటీవ‌లి ఏపీ స‌ర్కారు అవార్డుల‌ను సైతం లాగారు. ఇవాంకా అందంగా ఉంటుంది కాబ‌ట్టి ఆమెకు మూడు స్పెష‌ల్ జ్యూరీ అవార్డుల ఇవ్వాల‌ని సెటైర్ వేశారు.