Begin typing your search above and press return to search.

వ‌ర్మ వ‌ర్సెస్ దేవి!... చ‌ర్చ పీక్స్ వెళ్లిందిగా!

By:  Tupaki Desk   |   18 Jan 2018 5:15 AM GMT
వ‌ర్మ వ‌ర్సెస్ దేవి!... చ‌ర్చ పీక్స్ వెళ్లిందిగా!
X
బాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ.. డిజిట‌ల్ మీడియా వేదిక‌గా తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం *గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌* మ‌రోమారు హాట్ డిబేట్‌ కు దారి తీసింద‌నే చెప్పాలి. సెక్స్‌ను బేస్ చేసుక‌ని వ‌ర్మ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే ఓ ట్రైల‌ర్ రిలీజ్ కాగా.. ఈ నెల 26న స‌ద‌రు చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో నిన్న సాయంత్రం ఓ తెలుగు టీవీ న్యూస్ ఛానెల్ నిర్వ‌హించిన భేటీలో వ‌ర్మ నేరుగా స‌ద‌రు ఛానెల్ స్టూడియోకు వ‌చ్చి కూర్చోగా... ఫోన్ లైన్ సామాజిక ఉద్య‌మ‌కార‌ణి దేవి ఆయ‌న‌పై విరుచుకుపడ్డారు. ఇరువురి మ‌ధ్య పెద్ద ఎత్తున త‌గాదా ఏమీ న‌డ‌వ‌కున్నా... త‌న చిత్రంపై దేవి చేసిన వ్యాఖ్య‌ల‌కు బ‌దులిస్తున్న సంద‌ర్భంగా వ‌ర్మ ఘాటు కామెంట్లే చేశారు. అస‌లు తాను తీస్తున్న ఈ చిత్రంపై దేవి ఎందుక‌లా వ్యాఖ్యానిస్తున్నారో త‌న‌కు అర్ధం కావ‌డం లేద‌న్న వ‌ర్మ‌.. అస‌లు ప‌డ‌క గ‌దిలో ఇలానే ఉండాలంటూ ఎలా చెబుతార‌ని ప్ర‌శ్నించారు. మొత్తంగా మ‌నుషులంతా దేవి చెప్పిన‌ట్లుగానే ప్ర‌వ‌ర్తించాలా? అంటూ కూడా వ‌ర్మ సంధించిన తూటాల్లాంటి మాట‌లు... చ‌ర్చ‌ను నిజంగానే పీక్స్‌కు తీసుకెళ్లాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయినా ఈ చ‌ర్చ సంద‌ర్భంగా దేవి ఏమ‌న్నార‌న్న ప్ర‌శ్న‌కు వ‌స్తే... గుట్టుగా సాగాల్సిన లైంగిక చ‌ర్య‌ల‌ను బ‌హిరంగంగా ఎలా చూపుతార‌ని ఆమె ప్ర‌శ్నించారు. అలా చేసిన‌ప్పుడు మ‌నుషుల‌కు, జంతువుల‌కు తేడా ఏముంటుంద‌ని కూడా మండిపడ్డారు. వ‌ర్మ త‌న చిత్రం ద్వారా మ‌నుషులు కూడా జంతువుల్లా ప్ర‌వ‌ర్తించాలంటారా? అని ఆమె త‌న‌దైన శైలిలో గ‌ట్టిగానే ప్ర‌శ్న‌లు సంధించారు. జంతువుల కంటే ఓ మెట్టు ఎదిగిన కార‌ణంగానే క‌దా... మ‌నుషులు బ‌ట్ట‌లు వేసుకుంటున్నార‌ని చెప్పిన దేవి... వ‌ర్మ త‌న చిత్రంలో మ‌నుషుల‌ను బ‌ట్ట‌లు లేకుండా చూపితే... అది అశ్లీలం కాకుండా ఏమ‌వుతుంద‌ని, ఇలాంటి సినిమాల కార‌ణంగా స‌మాజానికి న‌ష్ట‌మే త‌ప్పించి లాభ‌మేముంద‌ని ప్ర‌శ్నించారు. అంతేకాకుండా ఇలాంటి చెత్త సినిమాల‌తో జ‌నాల‌కు ఏం చెత్త చూపాల‌నుకుంటున్నార‌ని కూడా ఆమె కాస్తంత గ‌ట్టిగానే త‌న స్వ‌రాన్ని వినిపించారు. దేవి ప్ర‌శ్నించినంత సేపు సైలెంట్‌గానే కూర్చున్న వ‌ర్మ‌... ఆ త‌ర్వాత త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చేశారు.

మ‌నుషుల‌కు - జంతువుల‌కు తేడాలు చూస్తున్న దేవి... అస‌లు మ‌నుషులు ఎలా ఉండాలో ఆమె ఎలా నిర్ణ‌యిస్తార‌ని ఎదురు ప్ర‌శ్నించారు. అయినా దేవి మాట్లాడే ప్ర‌తి విష‌యం చెత్త‌గానే ఉంటుంద‌ని, అస‌లు ఆమె జీవితం అంతా చెత్తేన‌ని, అందుకే నిత్యం త‌న వ్యాఖ్య‌ల్లో చెత్త అనే ప‌దాన్ని ఆమె వాడుతుంటార‌ని కూడా వ‌ర్మ త‌న‌దైన మార్కు కామెంట్లు సంధించారు. అయినా ఎప్పుడైనా జీవితాన్ని ఆస్వాదించారా? అని కూడా దేవిని ప్ర‌శ్నించిన వ‌ర్మ‌... త‌న‌కు మాత్రం దేవి త‌న జీవితాన్ని చాలా చెత్త‌గానే సాగిస్తున్నార‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. చెత్త జీవితం గ‌డుపుతున్న దేవి నోట చెత్త అనే ప‌దం కాకుండా ఇంకేం వినిపిస్తుంద‌ని కూడా వ‌ర్మ సెటైర్లు సంధించారు.

ప‌డ‌క గ‌దిలో ఆడా మ‌గా బ‌ట్ట‌లేసుకుని లైంగిక కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని దేవి చెబుతున్నారా? అదేనా ఆమె ఉద్దేశం? అని కూడా వ‌ర్మ త‌న‌దైన శైలి ప్ర‌శ్న‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ప‌డ‌క గ‌దిలో బ‌ట్టలేసుకుని సెక్స్‌లో పాల్గొంటేనే మ‌నుషులు... జంతువుల‌తో స‌మానం కాద‌ని భావిస్తారా? అని కూడా ఆయ‌న దేవిని ప్ర‌శ్నించారు. మొత్తంగా త‌న చిత్రంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన దేవిని... వ‌ర్మ త‌న‌దైన స్టైల్లో విరుచుకుప‌డ్డార‌నే చెప్పాలి. అయితే స‌ద‌రు ఛానెల్‌లో వ‌ర్మ ప్ర‌శ్న‌ల‌కు మ‌రోమారు స్పందించే అవకాశం దేవికి ఇవ్వ‌లేదు. దీంతో ఈ చ‌ర్చ ఓ పీక్స్‌కు వెళ్లినా... ప‌ర‌స్ప‌ర వాద‌న‌లు - ప్ర‌తివాద‌న‌లు - అరుపులు - కేక‌లు లేకుండానే ముగిసింద‌ని చెప్పాలి. ఇక చివ‌ర‌గా త‌న‌ను ప్ర‌శ్నించిన దేవికి థ్యాంక్స్ చెప్పిన సంద‌ర్భంగా దేవితో పాటు మ‌రో మ‌హిళా ఉద్య‌మ నేత సంధ్య పేరును కూడా ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం.