మన కేంద్రమంత్రుల కండల పోటీలు చూశారా?

Thu Apr 20 2017 19:50:20 GMT+0530 (IST)

కేంద్ర మంత్రులు రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ - కిరణ్ రిజిజు జిమ్ లో చెమటోడుస్తున్న వీడియో - ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. సీరియస్ గా వాళ్లు చేస్తున్న కసరత్తులు చూస్తుంటే...ప‌్రధాని నరేంద్ర మోడీ వీళ్లకు ఫిట్ నెస్ పరీక్షలు కూడా పెట్టారా అన్న సందేహం కలగక మానదు. కానీ అలాంటిదేమీ లేదు. ఆరోగ్యం కోసం మోడీ కేబినెట్ లోని మంత్రులు జిమ్ లో చెమట చిందిస్తున్నారు. కసరత్తులు చేస్తూ కండలు కరిగిస్తున్నారు.

తన వర్కవట్స్‌కు సంబంధించిన వీడియోను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి రిజిజు తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి ట్విట్టర్ లో ఫిట్ నెస్ గోల్స్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతున్నది. పనిలో పనిగా ఈ ఇద్దరు మంత్రులు ఒకరిపై ఒకరు ప్రశంసలు కూడా కురిపించుకున్నారు. రాథోర్ తనకు కష్టమైన చాలెంజే విసిరారని రిజిజు అంటే.. బిజీ షెడ్యూల్ లోనూ మీరు టఫ్ కాంపిటిషన్ ఇస్తున్నారని రాథోర్ ట్వీట్ చేశారు.

ఇక వీళ్ల ట్విట్టర్ సంభాషణలోకి కేంద్ర క్రీడామంత్రి విజయ్ గోయెల్ కూడా వచ్చారు. రాథోర్ ను ఇండియా రాకీ బల్బోవాగా ఆయన అభివర్ణించారు. హాలీవుడ్ నటుడు సిల్వస్టెర్ స్టాలోన్ రాకీ సిరీస్ లోని క్యారెక్టర్ పేరిది. ఇక వీళ్ల ఫిట్‌నెస్ కసరత్తులు చూస్తుంటే తనకు భయమేస్తుందని రైల్వేమంత్రి సురేశ్ ప్రభు ట్వీట్ చేశారు. వాళ్ల రేంజ్ లో కాకపోయినా.. తాను కూడా కాస్త ఫిట్ నెస్ కసరత్తులు చేస్తానని చెప్పారు. రైల్వే మంత్రి ట్వీట్ పై రాథోర్ - రిజిజు స్పందిస్తూ ఇది తమకు దక్కిన ప్రశంస అని చెప్పారు. మొత్తంగా మంత్రుల ఆహ్లాదపూరిత జిమ్ చర్యలు ఇప్పుడు సోషల్  మీడియాలో టాప్ లో నిలిచాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/