Begin typing your search above and press return to search.

రాజ్ నాథ్‌ ను లైట్ తీసుకొని షాకిచ్చారు

By:  Tupaki Desk   |   21 April 2017 4:49 AM GMT
రాజ్ నాథ్‌ ను లైట్ తీసుకొని షాకిచ్చారు
X
కీల‌క నేత‌లు వ‌స్తున్నారంటే.. ఎంత అలెర్ట్ గా ఉన్నారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అందులోకి దేశ హోం మంత్రి ఒక కార్య‌క్ర‌మానికి అటెండ్ అవుతున్నారంటే.. ఆయ‌న రాక కోసం అంతా ముందే వ‌చ్చేసి వెయిట్ చేయ‌టం కామ‌న్‌. కానీ.. అందుకు భిన్నంగా జ‌రిగిన ఈ వైనం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ కు షాకిచ్చేలా చేసింది. ఆయ‌న అతిధిగా పాల్గొన్న ఒక కార్య‌క్ర‌మం జ‌ర‌గాల్సిన షెడ్యూల్ కు జ‌ర‌గ‌కుండా.. ఆల‌స్యంగా జ‌ర‌గ‌టంపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజ్‌ నాథ్ స్థాయి నేత ఒక కార్య‌క్ర‌మానికి వ‌స్తుంటే ఏర్పాట్లు ఎంత ప‌క్కాగా ఉండాలన్న కోణంలో చూస్తే.. జ‌రిగిన ఉదంతంలో నిర్ల‌క్ష్యం పాళ్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి.

హోంమంత్రి స్థాయి వ్య‌క్తి విష‌యంలో టైం సెన్స్ లేకుండా వ్య‌వ‌హ‌రించిన తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌ట‌మే కాదు.. చివ‌ర‌కు రాజ్ నాథ్ కు కూడా ఈ వ్య‌వ‌హారం చిరాకు పుట్టించింది. త‌న మ‌న‌సుకు క‌లిగిన ఇబ్బందిని బాహాటంగానే చెప్పేశారు రాజ్ నాథ్‌. ఇండియ‌న్ స‌ర్వీసెస్‌ కు చెందిన అధికారులు పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మం దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగింది. షెడ్యూల్ ప్ర‌కారం జ‌ర‌గాల్సిన కార్య‌క్ర‌మం ఏకంగా 12 నిమిషాలు ఆల‌స్యంగా మొద‌లైంది. ఈ కార్య‌క్ర‌మం ఉద‌యం 9.45 గంట‌ల‌కు ప్రారంభం కావాల్సిన ఉండ‌గా.. రాజ్‌ నాథ్ ఐదు నిమిషాలు ముందే వ‌చ్చేశారు. సాధార‌ణంగా ముఖ్య అతిధి ఆల‌స్యంగా రావ‌టం జ‌రుగుతుంది.

కానీ.. రాజ్ నాథ్ మాత్రం షెడ్యూల్ కంటే ఐదు నిమిషాలు ముందే కార్య‌క్ర‌మానికి వ‌చ్చేశారు. అయిన‌ప్ప‌టికీ.. కార్య‌క్ర‌మం మొద‌లు కాలేదు. ఎందుకంటే.. మిగిలిన వారు రాలేదు. దీంతో.. ఆయ‌న మ‌రింత సేపు వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు షెడ్యూల్ కు 12 నిమిషాలు ఆల‌స్యంగా కార్య‌క్ర‌మం మొద‌లైంది. టైంసెన్స్ విష‌యంలో అధికారుల తీరును త‌ప్పు ప‌ట్టిన రాజ్ నాథ్‌.. ఉద‌యం 9.45కు ప్రారంభం కావాల్సిన కార్య‌క్రమానికి తాను ఐదు నిమిషాలు ముందే వ‌చ్చాన‌ని.. కానీ.. కార్య‌క్ర‌మం మాత్రం 12 నిమిషాలు ఆల‌స్యంగా జ‌రిగింద‌ని.. టైమ్ సెన్స్ చాలా అవ‌స‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. సివిల్ స‌ర్వీసెస్‌ ను స్టీల్ ఫ్రేంగా వ‌ర్ణించిన ఆయ‌న‌.. ఇప్పుడా స్టీల్ ఫ్రేం బ‌ల‌హీన‌ప‌డిందా? అన్న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఏమైనా కేంద్ర హోం మంత్రి స్థాయి నేత కార్య‌క్ర‌మానికి వ‌స్తున్నారంటే.. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ముందే రావాల్సింది పోయి.. తాపీగా రావ‌టం చూసిన‌ప్పుడు వారి క‌మిట్ మెంట్ ను శంకించ‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/