Begin typing your search above and press return to search.

న్యాయం చేస్తారంట కానీ హోదాపై మాట్లాడ‌రంట‌

By:  Tupaki Desk   |   4 Aug 2015 9:10 AM GMT
న్యాయం చేస్తారంట కానీ హోదాపై మాట్లాడ‌రంట‌
X
తెలుగు రాష్ట్రాల ఆందోళ‌న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ ను క‌దిలించిన‌ట్లుంది. మంగ‌ళ‌వారం ఆయ‌న తెలుగు రాష్ట్రాల ఎంపీలు చేస్తున్న‌ ఆందోళ‌న‌ను దృష్టిలో పెట్టుకొని కొన్ని వ్యాఖ్య‌లు చేశారు.విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీకి త‌గ్గ‌ట్లే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ఏపీ ఎంపీలు డిమాండ్ చేస్తుంటే.. తెలంగాణ‌రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయాల‌ని తెలంగాణ ఎంపీలు ఆందోళ‌న చేస్తున్నారు.

ఈ డిమాండ్ల‌ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన రాజ్‌నాథ్‌.. తెలుగు రాష్ట్రాల‌కు న్యాయం చేస్తామ‌ని.. వారికి ఎలాంటి అన్యాయం చేయ‌మ‌ని వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యం గురించి మాట్లాడాల‌ని కోరిన‌ప్ప‌టికీ దానిపై స్పందించేందుకు మాత్రం ఆయ‌న ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

కాగా.. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై తీర్మానం ఇవ్వ‌గా.. స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ దానిపై చ‌ర్చ‌కు తిర‌స్క‌రించారు. న్యాయం చేస్తామ‌న్న అంశాల‌పై క‌నీసం చ‌ర్చ కూడా సాగ‌ని నేప‌థ్యంలో.. ఏపీకి న్యాయం జ‌రిగే అవ‌కాశం ఉందా? అన్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై క‌నీసం స్పందించేందుకు కూడా హోం మంత్రి ఇష్ట‌ప‌డ‌ని నేప‌థ్యంలో.. ఏపీకి ఏ మాత్రం న్యాయం చేస్తారంటూ ఏపీకి చెందిన విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.