Begin typing your search above and press return to search.

ర‌జ‌నీతో బీజేపీ అనుబంధ పార్టీ భేటీ..!

By:  Tupaki Desk   |   19 Jun 2017 11:02 AM GMT
ర‌జ‌నీతో బీజేపీ అనుబంధ పార్టీ భేటీ..!
X
త‌మిళ ఫిల్మ్ స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ అరంగేట్రంపై జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్న క్ర‌మంలోనే మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం చోటుచేసుకుంది. బీజేపీ అనుబంధ పార్టీగా పేరున్న హిందూ మ‌క్కల్ క‌చ్చి నేత‌లు తాజాగా ర‌జనీని క‌లుసుకున్నారు. సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీ నివాసంలోనే ఆయ‌న‌తో ఆ నేతలు భేటీ అయ్యారు. ఈ వార్త త‌మిళ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

ర‌జ‌నీతో హిందూ మ‌క్క‌ల్ క‌చ్చి నేత అర్జున్ సంప‌త్‌ - ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌వికుమార్ భేటీ అయ్యారు. దాదాపు అర‌గంట పాటు వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. ఈ వార్త ప్ర‌సార మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది. బీజేపీకి ర‌జ‌నీ ద‌గ్గ‌రవుతున్నార‌నేందుకు ఇదే సంకేతమ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు జోష్యం చెప్పారు. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీ ఎంట్రీ ఇచ్చారు. హిందు మ‌క్క‌ల్ క‌చ్చి నేత‌ల‌తో స‌మావేశంపై వివ‌ర‌ణ ఇచ్చారు. బీజేపీ అనుబంధ పార్టీ నేత‌లు త‌న‌ను సాధార‌ణంగానే క‌లిశార‌న్నారు. ఆ భేటీలో రాజ‌కీయం ఏమీ లేద‌ని సూప‌ర్ స్టార్ తెలిపారు.కాగా ఇటీవల ఢిల్లీలో తమిళనాడు రైతుల ఆందోళనలకు నాయకత్వం వహించిన పీ అయ్యకన్ను ఆధ్వర్యంలోని రైతు ప్రతినిధులను రజనీ క‌లుసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ భేటీతోనే ర‌జ‌నీ రాజకీయరంగ ప్రవేశంపై మళ్లీ చర్చ మొదలైంది. నదుల అనుసంధానానికి రూ.కోటి అందజేస్తానని ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీ హామీ ఇచ్చారు. రైతుల విజ్ఞప్తిమేరకు వారి సమస్యను ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు.

సమరానికి సిద్ధంగా ఉండండి అంటూ ఇటీవల అభిమానులకు పిలుపునిచ్చిన రజినీ.. కొన్నివారాల తర్వాత రైతు ప్రతినిధులతో వారి సమస్యపై మాట్లాడటంపై రాజకీయంగా వేడి పుట్టిస్తున్నది. ద్వీపకల్ప సంబం ధం ఉన్న మహానది - గోదావరి - కృష్ణా - పాలార్ - కావేరి నదుల అనుసంధానం కోసం ముందుకు సాగుతానని రజనీ చెప్పినట్టు జాతీయ దక్షిణభారతదేశ నదుల అనుసంధాన రైతుల అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యకన్ను తెలిపారు. నది అనుసంధానానికి రూ.కోటి ఇచ్చేందుకు రజనీ ప్రతిపాదించారు. ఈ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మేం కోరాం అని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/