Begin typing your search above and press return to search.

రజ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీ..తేదీ ఎజెండా ఇదే

By:  Tupaki Desk   |   27 May 2017 10:21 AM GMT
రజ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీ..తేదీ ఎజెండా ఇదే
X
త‌మిళ రాజ‌కీయాల్లో సంచ‌ల‌న ప‌రిణామానికి వేదిక రెడీ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం తర్వాత త‌మిళ రాజ‌కీయాలు పూర్తిగా మారిపోయాయి. కొన్నాళ్ళుగా ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ‌ప్రవేశం గురించి అనేక చ‌ర్చ‌లు జ‌రిగాయి. రజ‌నీకాంత్ రాజ‌కీయాల‌లోకి రావాలని అభిమానులు స్వాగ‌తించిన వ్య‌తిరేఖ వ‌ర్గం మాత్రం తలైవా పొలిటిక‌ల్ ఎంట్రీకి అడ్డుగా నిల‌బ‌డుతున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు రజ‌నీకాంత్ రాజ‌కీయాల‌లోకి వ‌స్తారా లేదా అనే దానిపై చాలా సందేహాలు నెల‌కొన్నాయి.

తాజాగా ర‌జ‌నీకాంత్ సోద‌రుడు స‌త్య‌నారాయ‌ణ‌రావు గైక్వాడ్ సంచ‌లన ప్ర‌క‌ట‌న చేశారు. అవినీతిని అంతం చేయ‌డానికి త‌న సోద‌రుడు రాజ‌కీయాల‌లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. పార్టీ పేరు, జెండా, ఎజెండా త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా, జూలైలో దీనిపై ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని స‌త్యనారాయ‌ణ అన్నారు. కాగా, ఇప్ప‌టికే త‌మిళ రాష్ట్రాల‌లో ర‌జ‌నీకాంత్ ని ఆహ్వ‌నిస్తూ పోస్ట‌ర్స్ ప్ర‌ద‌ర్శించ‌గా, అభిమానులు త‌మ హీరో చేయ‌బోయే ప్ర‌క‌ట‌న కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో త‌మిళ రాజ‌కీయాల‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో. మ‌రోవైపు టాలీవుడ్‌ నటుడు, రజనీ స్నేహితుడు శతృఘ్నసిన్హా.. ర‌జినీకాంత్ ని పాలిటిక్స్ లోకి గ్రాండ్ వెల్ క‌మ్ చెబుతున్న సంగ‌తి తెలిసిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/