Begin typing your search above and press return to search.

తంబీలకు టికెట్ల షాకిచ్చిన తలైవా!

By:  Tupaki Desk   |   22 July 2018 11:55 AM GMT
తంబీలకు టికెట్ల షాకిచ్చిన తలైవా!
X
ఇంగ్లీష్ లో ఓ పాపులర్ కొటేషన్ ఉంది 'ఇఫ్ ఎవిరిబడీ లైక్స్ యు.. దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ యు' ( నిన్ను ప్రతిఒక్కరూ ఇష్టపడుతున్నారంటే.. నీలో ఏదో లోపం ఉన్నట్టే).. వినడానికి విడ్డూరంగా ఉంటుంది కానీ కాస్త లాజికల్ గా ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చేతిలో ఉండే ఐదు వేళ్ళే ఐదు రకాలుగా ఉంటే.. ఈ సమాజంలో ఉండే వాళ్ళు ఎన్ని రకాలుగా ఉండాలి? వాళ్ళందరిని మెప్పించడం సాధ్యమేనా? వారందరూ నిన్ను ఇష్టపడాలంటే.. నువ్వు అందరికీ తగ్గట్టుగా ఉండాలంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు.

ఇదంతా మనలాంటి మామూలు వాళ్ళకు. కానీ తలైవా రజనికాంత్ కు కోట్లలో అభిమానులు ఉంటారు కదా. మరి ఆయన సంగతేంటి? సినిమాల్లో ఉన్నంతవరకూ అయనకు పెద్దగా ఇబ్బందులు రాలేదు గానీ రాజకీయ నాయకుడి అవతారమెత్తిన తర్వాత ఆయనకు కాస్త హీట్ తగలడం మొదలయింది. రజనికాంత్ తన పొలిటికల్ ఎంట్రీని పోయినేడాది డిసెంబర్ లో ప్రకటించిన సమయం నుండి.. అయనకున్న అశేష ఫ్యాన్ క్లబ్ ల లీడర్లందరూ తమ పొలిటికల్ ఎంట్రీ కన్ఫాం అయినట్టుగా భావించారు. అందులో చాలామంది ఎమ్మెల్యే - ఎంపీ టికెట్లు ఆశిస్తున్నారు. కానీ చెన్నై నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం వాళ్ళందరికీ తలైవా హోల్ సేల్ గా షాక్ ఇచ్చాడట.

ఫ్యాన్స్ అసోసియేషన్లలో జిల్లా స్థాయిలో గానీ, రాష్ట్ర స్థాయిలో గానీ కీలక పాత్ర పోషిస్తున్న వారు, ఇతర ముఖ్యులు ఎవరూ మన పార్టీ ఎలెక్షన్ల కు వెళ్ళినప్పుడు 'ఎమ్మెల్యే - ఎంపీ టికెట్లు ఆశించవద్దని' ఇంటర్నల్ కమ్యునికేషన్ లో తెలిపారని టాక్. అంటే.. పనిచేయండి గానీ టికెట్ల సంగతి మాట్లాడొద్దు అని తమిళ భాషలో తంబీలకు సున్నితంగా చెప్పినట్టే. ఒకవైపు దీనిమీద జోకులు కూడా మొదలయ్యాయట. "ఆలు లేదు చూలు లేదు..'' టైపు లో తమిళ నేటివ్ సామెతలు వేసుకుని నవ్వుకుంటున్నారట. మరోవైపు ఇతర పార్టీల వారు "బాషా ఒక్క టిక్కెట్ ఇస్తే వంద ఇచ్చినట్టే అంటాడా ఏంటి?" అని జోకులు పేలుస్తున్నారట.