Begin typing your search above and press return to search.

ఆ జ‌ర్న‌లిస్ట్‌ కు లైవ్‌ లోనే షాకిచ్చిన‌ ప్ర‌ణ‌బ్ దా

By:  Tupaki Desk   |   16 Oct 2017 11:03 AM GMT
ఆ జ‌ర్న‌లిస్ట్‌ కు లైవ్‌ లోనే షాకిచ్చిన‌ ప్ర‌ణ‌బ్ దా
X

దేశంలోని అత్యంత సీనియ‌ర్ నాయ‌కుల జాబితా తీస్తే...అందులో పూర్తి సంయ‌మ‌నంగా - శాంతంగా క‌నిపించే వారిని పేర్ల‌ను విశ్లేషిస్తే...కాంగ్రెస్ పార్టీ దిగ్గ‌జం...తాజా మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ ముఖ‌ర్జీ పేరు టాప్‌ లో ఉంటుంది. ఎలాంటి సంక్షోభాన్ని అయిన డీల్ చేయ‌గ‌ల ప్ర‌ణ‌బ్ దా...అంతే సంయ‌మ‌నంతో కూడా వ్య‌వ‌హ‌రించ‌గ‌ల‌రు. అలాంటి దిగ్గ‌జం ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌ పై అస‌హ‌నానికి లోన‌య్యారు. లైవ్‌ లోనే ఆయ‌న తీరును త‌ప్పుప‌ట్టారు.

రాష్ట్రప‌తి ప‌ద‌వీ కాలం పూర్త‌యిన త‌ర్వాత తాను రాసిన ఓ పుస్త‌కాన్ని ఇటీవ‌ల మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ రాజ్‌ దీప్ స‌ర్దేశాయ్ ఆయ‌న్ను ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ క్ర‌మంలో రాజ్‌ దీప్ మ‌ధ్య‌లో జోక్యం చేసుకుంటుండ‌గా... మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ మ‌ధ్య‌లోనే క‌ల్పించుకున్నారు. ``మీరు ఒక్క విష‌యం గ‌మ‌నించాలి. మీరు ఇంట‌ర్వ్యూ చేస్తోంది మాజీ రాష్ట్రప‌తిని. నాకేమీ టీవీ తెర‌పై క‌నిపించాల‌నే ఆస‌క్తి లేదు...మీరు పిలిస్తేనే వ‌చ్చాను.``అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. దీంతో రాజ్‌ దీప్ స‌ర్దేశాయ్ త‌నంత తానుగా మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అయితే, ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.