Begin typing your search above and press return to search.

లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు పాత ఈవీఎంలే వాడ‌తార‌ట‌!

By:  Tupaki Desk   |   9 Feb 2019 5:56 AM GMT
లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు పాత ఈవీఎంలే వాడ‌తార‌ట‌!
X
ఇటీవ‌ల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వినియోగించిన ఈవీఎంల‌నే మ‌రికొద్ది నెలల్లో నిర్వ‌హించే లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ వినియోగించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన స్ప‌ష్ట‌త తాజాగా వ‌చ్చేసింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వాడిన అత్యాధునిక ఓటింగ్ యంత్రాల‌ను లోక్ స‌భ ఎన్నిక‌ల్లో వినియోగించాల‌ని.. కాకుంటే వాటిలోని పాత బ్యాట‌రీల్ని తొల‌గించి కొత్త బ్యాట‌రీలు వేయాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నిర్వ‌హించిన ఈవీఎంల‌పై విప‌క్ష నేత‌లు ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే 29 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల్ని స‌వాలు చేస్తూ హైకోర్టులో కేసులు న‌మోద‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో స‌ద‌రు 29 నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం పాత ఈవీఎంల‌ను వాడ‌రు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంఘం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక‌.. కోర్టు కేసులు లేని మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వాడిన ఈవీఎంల‌ను వినియోగించనున్నారు.

ఇక‌.. ఈవీఎంల ప‌నితీరును ప‌రిశీలించ‌టానికి.. ప‌ర్య‌వేక్షించ‌టానికి వీలుగా సాంకేతిక బృందాన్ని రాష్ట్రానికి పంపాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల అధికారి ర‌జ‌త్ కుమార్ బెల్ కు లేఖ‌లు రాసిన‌ట్లుగా చెబుతున్నారు. ఏప్రిల్.. మే లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చే నెల మొద‌టివారంలో వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. మ‌రి.. పాత ఈవీఎంలనే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వాడాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో ఈ అంశంపై విప‌క్షాలు ఏ తీరులో రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.