Begin typing your search above and press return to search.

రాజమౌళి.. ఓ సెన్సేషనల్ కాంబినేషన్

By:  Tupaki Desk   |   5 Aug 2015 6:35 AM GMT
రాజమౌళి.. ఓ సెన్సేషనల్ కాంబినేషన్
X
రాజమౌళి ప్రస్తుతం బాహుబలి-2 పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి నుంచి బయటికి రావడానికి ఇంకో ఏడాదిపైనే పడుతుంది. ఆ తర్వాత రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తాడన్నది ప్రస్తుతానికున్న సమచారం. ఐతే రాజమౌళి తో సినిమా ప్రపోజల్ ఉన్న మాట వాస్తవమే కానీ.. ఇంకా ఏదీ మెటీరియలైజ్ కాలేదని చెప్పేశాడు మహేష్. రాజమౌళికి మహేష్ తో ఓ కమిట్మెంట్ ఉంది కానీ.. బాహుబలి-2 అవ్వగానే ఆ సినిమానే మొదలుపెట్టాలనేమీ లేదు. కాబట్టి రాజమౌళి తర్వాతి సినిమా విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా రాజమౌళితో ఓ సెన్సేషనల్ కాంబినేషన్ అంటూ వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.

తమిళ స్టార్ హీరో అజిత్, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్లో రాజమౌళి తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ తీస్తాడన్నది లేటెస్ట్ సమాచారం. ఈ మేరకు ఓ నిర్మాత కాంబినేషన్ సెట్ చేసినట్లు చెన్నై మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. యథావిధిగా ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారు. అజిత్ తో రాజమౌళి సినిమా గురించి మీడియాకు హింట్ ఇచ్చింది కూడా విజయేంద్ర ప్రసాదే. ఈ వార్తలో నిజమెంత అన్నది కొన్నాళ్ల తర్వాత తేలుతుంది కానీ.. రాజమౌళి డైరెక్షన్ లో అల్లు అర్జున్, అజిత్ కలిసి నటించడమన్నది ఊహకైనా అందని విషయం. ఇది కార్యరూపం దాల్చితే సౌత్ ఇండియాలో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీస్ లో ఒకటవుతుంది. ఈ కాంబినేషన్ నిజమవ్వాలని కోరుకుందాం.