Begin typing your search above and press return to search.

రాజు మిగిలారు... సైన్యం స‌చ్చింది

By:  Tupaki Desk   |   11 Dec 2018 1:28 PM GMT
రాజు మిగిలారు... సైన్యం స‌చ్చింది
X
కింగ్ మేక‌ర్ అపుడు అవుదామా? ఇపుడు అవుదామా? అన్న‌ట్టు తెగ ఆత్ర‌ప‌డిన బీజేపీ వెన్ను విరిగి తెలంగాణ మంచంపై న‌డుం వాల్చింది. ఇంకా ఫ‌లితాలు రాక‌ముందే ఎగ్జిట్ పోల్స్ చూసి తానే కింగ్ అని ఊహించేసుకుని మేడ‌లు క‌ట్టుకుని బీజేపీ తెలంగాణ‌లో ప‌రువు పోగొట్టుకుంది. మేము లేనిదే మీరు లేరు అన్న‌ట్టు...రిజ‌ల్టుకు ముందే ష‌ర‌తులు కూడా పెట్టేసింది బీజేపీ. తీరా బొక్క‌ బోర్లా ప‌డింది. దాని మీద కేసీఆర్ త‌న రెండు గంట‌ల ప్రెస్‌ మీట్లో క‌నీసం స్పందించ‌లేదు. తెలంగాణ‌లోని 119 సీట్ల‌లో పోటీ చేసిన బీజేపీ జీరో కాకుండా కాపాడిన ఏకైక వ్య‌క్తి రాజాసింగ్‌. కరుడుగట్టిన హిందుత్వవాది అయిన రాజాసింగ్ హిందు ఓట్ల‌తోనే త‌న ప్ర‌భంజ‌నం సృష్టించాడు. రాష్ట్ర అధ్య‌క్షుడితో సహా అంద‌రూ మ‌ట్టి క‌రిస్తే ఆయ‌న ఒక్క‌రే నెగ్గి పార్టీ ప‌రువు కొంచెమైనా కాపాడారు. తాజా ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ప్రేమ్‌ సింగ్ రాథోడ్‌ ను ఓడించి 17 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

రాజాసింగ్ తన రాజకీయ ప్రయాణం మొద‌లుపెట్టింది టీడీపీ నుంచే. 2009లో మంగళ్‌ హట్ కార్పొరేటర్‌ గా పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014లో టీడీపీ టిక్కెట్ నిరాక‌రించ‌డంతో బీజేపీలో చేరి గోషామహల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. ఇక్క‌డ ఉత్తరాది ప్రజలు ఎక్కువగా ఉంటారు. కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరుతెచ్చుకున్న రాజాసింగ్ చివ‌ర‌కు హిందూ ఓట్ల‌ను స‌మైక్య‌ప‌రిచి ఇక్క‌డ గెలిచారు. ద్వంద విధానాలు పాటించి ఇత‌న్ని ప‌క్క‌న పెట్టిన రాష్ట్ర నేత‌లంతా ఓడిపోయారు.