Begin typing your search above and press return to search.

ఆ సినిమా వచ్చినప్పుడు పట్టలేదా రాహుల్?

By:  Tupaki Desk   |   21 Oct 2017 1:13 PM GMT
ఆ సినిమా వచ్చినప్పుడు పట్టలేదా రాహుల్?
X
ఇప్పుడు కాంగ్రెస్ యువరాజు 'మెర్సాల్' సినిమాపై తన అభిమానాన్నిభలే చాటుకున్నారు. ''డియర్ మోడి. సినిమా అనేది తమిళులు తమ సంస్కృతిని తెలియజెప్పే సాధనం. దానిని మీరు డీ-మోనెటైజేషన్ తరహాలో తొక్కేయాలని చూడొద్దు' అనే మీనింగులో ట్వీటేసిన రాహుల్.. 'మెర్సాల్' సినిమాలో జి.ఎస్.టి పై విజయ్ పేల్చిన డైలాగులు కట్ చేయాలంటున్న తమిళనాడు బిజెపి డిమాండ్ ను తోసిపుచ్చారు. బాగానే ఉంది.

విషయం ఏంటంటే.. రాహుల్ గాంధి ఇప్పుడు ఇంతటి ప్రీతిదాయకంగా మెర్సాల్ సినిమా గురించి మాట్లాడుతున్నారు కాని.. ఇదే తమ వరకు వచ్చేసరికి చాలా కఠోరంగా బిహేవ్ చేశారు. మీకు గుర్తుందో లేదో ఆ మధ్యన 'ఇందూ సర్కార్‌' అంటూ మధుర్ బండార్కర్ తీసిన సినిమాను.. అసలు చూడకుండానే బ్యాన్ చేయాలంటూ కాంగ్రెస్ వర్గీయులు కోర్టుకు ఎక్కారు. ఆందోళనలు చేశారు. మరి రాహుల్ బుద్ది అప్పుడు ఏమైనట్లో? అలాగే అప్పట్లో మహారాష్ట్రలో ఇద్దరు యువతులను పేస్ బుక్ లో బాల థాక్రే గురించి వ్యతిరేక కామెంట్లు పెట్టారనే నెపంతో అరెస్ట్ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ దే. అటువంటి పార్టీ ఇప్పుడు ఫ్రీ స్పీచ్ గురించి మాట్లాడుతుంటే కామెడీగానే ఉంది మరి.

ఇకపోతే మెర్సాల్ సినిమా గురించి ఇప్పుడు ప్రతీ రాజకీయ పార్టీ ఏదో ఒక ఒపినీయన్ చెబుతూను ఉంది. ఇదంతా చూస్తుంటే అందరూ తమ పొలిటికల్ మైలేజీకోసం ఈ సినిమాను భలే వాడుకుంటున్నారు అన్నట్లే ఉంది.