Begin typing your search above and press return to search.

అమిత్‌ షాకు రాహుల్ కంగ్రాట్స్‌..

By:  Tupaki Desk   |   22 Jun 2018 2:15 PM GMT
అమిత్‌ షాకు రాహుల్ కంగ్రాట్స్‌..
X
పెద్ద నోట్ల ర‌ద్దు ప‌ర్వంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఉక్కిరి బిక్కిరి అవుతున్న సంగ‌తి తెలిసిందే. 2016 నవంబర్‌ లో నోట్ల రద్దును ప్రకటించగా...అమిత్‌షా డైరెక్ట‌ర్‌గా ఉన్న బ్యాంకుకు మెజార్టీ లాభం జ‌రిగింద‌నే సంచ‌ల‌న అంశం ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రభుత్వం రంగ బ్యాంకులకు రద్దు అయిన 500 - వెయ్యి నోట్లను స్వీకరించేందుకు 50 రోజుల సమయం ఇచ్చారు. అదే జిల్లా సహకార బ్యాంకులకు కేవలం 5 రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. అయిదు రోజుల గడవులోనే అహ్మదాబాద్ బ్యాంకులో రూ.750 కోట్ల రద్దు అయిన నోట్లు జమ చేశారు. దేశంలో మరే ఇతర జిల్లా సహకార బ్యాంకుల్లో ఇంత మొత్తాన్ని స్వీకరించలేదు. అయితే అహ్మాదాబాద్ బ్యాంకుకు.. బీజేపీ అధ్యక్షుడు షా డైరక్టర్‌ గా ఉన్నారు. డిమానిటైజేషన్ సక్సెస్ అయ్యిందని బీజేపీ భావిస్తున్నా.. దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్న సహకార బ్యాంకులకు అత్యధికంగా రద్దు అయిన నోట్లు వచ్చినట్లు తాజాగా ఆర్టీఐ ద్వారా తెలిసింది.

ఈ ప‌రిణామం అమిత్ షాను ఉక్కిరిబిక్కిరి చేసింది. బీజేపీ అధ్యక్షుడు షాకు కంగ్రాట్స్ చెబుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ చమత్కార ట్వీట్ చేశారు. నోట్ల రద్దుతో అమిషా బ్యాంకు టాప్ ప్లేస్ కొట్టేసిందని విమర్శించారు. అహ్మాదాబాద్‌కు చెందిన సహకార బ్యాంకు.. నోట్ల రద్దులో ఫస్ట్ ర్యాంక్ సాధించిందని రాహుల్ ఆరోపించారు. ఆ బ్యాంకు కేవలం 5 రోజుల్లోనే 750 కోట్ల రద్దు అయిన నోట్లను మార్చేసిందన్నారు. నోట్ల రద్దు చర్య వల్ల దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో జనం ఇబ్బందిపడ్డారు. కానీ అమిత్ షా బ్యాంకు మాత్ర లాభపడిందని రాహుల్ తీవ్రంగా విమర్శించారు.