Begin typing your search above and press return to search.

ఎవ‌రీ ప్రియాంక‌?రాహుల్ ఛాన్స్ ఎందుకిచ్చారు?

By:  Tupaki Desk   |   22 Nov 2017 6:48 AM GMT
ఎవ‌రీ ప్రియాంక‌?రాహుల్ ఛాన్స్ ఎందుకిచ్చారు?
X
యువ‌రాజుకు ప‌ట్టాభిషేక స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంది. ఏళ్ల‌కు ఏళ్లుగా సాగుతున్న ప‌ట్టాభిషేక కార్య‌క్ర‌మానికి మ‌రో రెండు వారాల్లో శుభం కార్డు ప‌డుతుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మువుతున్నాయి. ఓప‌క్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్న యువ‌రాజు రాహుల్‌.. మ‌రోవైపు త‌న టీంను సెట్ చేసుకుంటున్నాడు. పేరుకు సోనియ‌మ్మ అధ్య‌క్ష బాధ్య‌త‌ల్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు ఉన్నా.. కొద్దికాలంగా యువ‌రాజుల వారే చాలా ప‌నులు చ‌క్క‌బెతున్నారు. అనుకుంటాం కానీ అమ్మా.. కొడుకుల మాట ఒక‌లా ఉండ‌కుండా మ‌రోలా ఉండ‌దు క‌దా.

కాంగ్రెస్‌కు కొత్త ర‌క్తాన్ని ఎక్కించాల‌ని.. పాత‌త‌రానికి గుడ్ బై చెప్పాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న రాహుల్‌.. అందుకు త‌గ్గ‌ట్లే పావులు కదుపుతున్నారు. సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్లుగా చేస్తే జ‌రిగే న‌ష్టం ఏమిట‌న్న విష‌యం బాగా తెలిసిన రాహుల్‌.. త‌న టీంను తెలివిగా పార్టీలోకి తెస్తున్నారు.

కొద్ది నెల‌ల క్రితం క‌ర్ణాట‌క‌కు చెందిన పార్టీ మాజీ ఎంపీ.. సినీ న‌టి ర‌మ్య‌కు సోష‌ల్ మీడియా విభాగ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించారు. ఈ బాధ్య‌త‌ను మ‌రే ఇత‌ర సీనియ‌ర్ స‌భ్యుడికి అప్ప‌గించినా నిర్వ‌హించ‌లేరు. ఆ విష‌యం పార్టీలో అంద‌రికి తెలుసు. ఆ తీరులోనే తాజాగా మ‌రో బాధ్య‌త‌ను మ‌రో మ‌హిళ‌కు అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు రాహుల్‌.

సోష‌ల్ మీడియాలో కాంగ్రెస్ మార్క్ ను క‌నిపించేలా చేయ‌టంలో ర‌మ్య సాధించిన విజ‌యం రాహుల్ ఖాతాలోనే వేయాలి. ర‌మ్య‌లో ఆ కోణాన్ని గుర్తించినందుకు రాహుల్ ను అభినందించాల్సిందే.

తాజాగా ప‌త్రిక‌ల్లోకాల‌మిస్టుగా సుప‌రిచితురాలు.. పార్టీ ప్ర‌తినిధి ప్రియాంక చ‌తుర్వేదిని స‌మాచార విభాగం క‌న్వీన‌ర్ గా నియ‌మిస్తూ రాహుల్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదే విభాగానికి కార్య‌ద‌ర్శిగా ప్ర‌ణ‌వ్ ఝును ఎంపిక చేశారు. వ‌చ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తుండ‌టం.. ఆ త‌ర్వాత ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో త‌న‌దైన టీం కోసం రాహుల్ శ్ర‌మిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ర‌మ్య మార్క్ క‌నిపించిన‌ట్లే.. స‌మాచార విభాగంలో ప్రియాంక మార్క్ ఎంత‌లా చూపిస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.