Begin typing your search above and press return to search.

నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది : రాహుల్

By:  Tupaki Desk   |   14 Aug 2018 7:02 AM GMT
నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది : రాహుల్
X
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రాహుల్ గాంధీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని దేశం మొత్తం ఎదురుచూస్తోంది. కాంగ్రెస్ నాయకులైతే కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు.కానీ రాహుల్ మాత్రం 40 ఏళ్లకు చేరువైనా.. పెళ్లి మాట ఎత్తడం లేదు. పైగా ఇప్పుడు కాంగ్రెస్ కు అధ్యక్షుడు కూడా అయ్యారు. అలాంటి రాహుల్ గాంధీకి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది.

తాజాగా తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మంగళవారం మీడియా ఎడిటర్లతో సమావేశమయ్యారు. కొందరు ఔత్సాహిక జర్నలిస్టులు ‘రాహుల్ గాంధీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.?’ అని ఆయన్నే అడిగేశారు. దానికి ఆయన అంతే రోమాంటిక్ గా సమాధానమిచ్చారు. ‘తన పెళ్లి ఎప్పుడో అయిపోయింది. అది కాంగ్రెస్ పార్టీతో జరిగిపోయింది..’ అంటూ చమత్కరించారు. దీన్ని బట్టి ఇప్పట్లో రాహుల్ పెళ్లి చేసుకోడని.. అసలే ఉద్దేశం లేదని స్పష్టమైంది..

మీడియా ఎడిటర్లతో సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ తెలంగాణలో ఈసారి అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. ఏపీలో అధికారం కష్టమని.. కానీ బలపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ - తెలంగాణలో పొత్తులపై స్థానిక నేతల అభిప్రాయానికి అనుగుణంగా ముందుకెళ్తామని తెలిపారు. 2019లో మోడీ ప్రధాని అయ్యే అవకాశమే లేదని రాహుల్ స్పష్టం చేశారు.